కే‌సి‌ఆర్ ను ఢీ కొట్టే అభ్యర్థి ఎవరు ?

62
- Advertisement -

తెలంగాణలో ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇంకా ఆరు నెలల సమయం ఉన్నప్పటికి.. ఇప్పటి నుంచే రాజకీయ వేడి కనిపిస్తోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలే లక్ష్యంగా వ్యూహాలకూ పదును పెడుతున్నాయి. ఇప్పటికే రెండు సార్లు అధికారం చేపట్టిన బి‌ఆర్‌ఎస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో కూడా విజయం సాధించి ముచ్చటగా మూడవ సారి అధికారం చేపట్టాలని చూస్తోంది. మరోవైపు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఈసారైనా అధికారం దక్కించుకోవాలని ఆశతో ఉన్నాయి. అయితే ఈ రెండు పార్టీలతో పోల్చితే బి‌ఆర్‌ఎస్ పక్కా ప్రణాళికలతో స్పష్టమైన ఎజెండాతో ముందుకు సాగుతోంది. ప్రస్తుతం తెలంగాణ అభివృద్ది లోనూ, సంక్షేమంలోనూ ఆగ్రపథంలో దూసుకుపోతుంది.

దాంతో వచ్చే ఎన్నికల్లో కూడా కే‌సి‌ఆర్ సుపరిపాలననే కోరుకుంటున్నారు ప్రజలు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో కూడా బి‌ఆర్‌ఎస్ తరుపున సి‌ఎం అభ్యర్థి కే‌సి‌ఆరే అని కన్ఫర్మ్ చేశారు బి‌ఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ ఐటీ శాఖ మంత్రి కే‌టి‌ఆర్. వచ్చే ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ గెలిస్తే కే‌టి‌ఆర్ ముఖ్యమంత్రి పదవి చేపడతారని గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రతిపక్షాలు కూడా ఈ అంశాన్నే ప్రధానంగా చర్చకు తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో కూడా బి‌ఆర్‌ఎస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి కే‌సి‌ఆరే అని స్పష్టం చేయడంతో ఆ వార్తలన్నిటికి చెక్ పడినట్లైంది. ఇక బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా వారి యొక్క ముఖ్యమంత్రి అభ్యర్థులు ఎవరో చెప్పాలని కే‌టి‌ఆర్ డిమాండ్ చేశారు.

Also Read: CM KCR:వందకుపైగా సీట్లు సాధిస్తాం

అప్పుడే ప్రజలు సరైన నాయకుడిని ఎంచుకునేందుకు వీలుంటుందని చెప్పుకొచ్చారు కే‌సి‌ఆర్. అయితే బీజేపీ కాంగ్రెస్ పార్టీలలో ముఖ్యమంత్రి అభ్యర్థులు ఎవరనిది ఇప్పటికీ కూడా అంతుచిక్కని ప్రశ్నే ఎందుకంటే బీజేపీ తరుపును సి‌ఎం అభ్యర్థి రేస్ లో బండి సంజయ్ ఉన్నారు. ఈయనతో పాటు ఈటెల రాజేందర్ పేరు కూడా వినిపిస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ తరుపున రేవంత్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తోన్నప్పటికి బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి వాళ్ళు కూడా సి‌ఎం అభ్యర్థి రేస్ లోనే ఉన్నారు. దాంతో ఈ రెండు పార్టీలకు కూడా సి‌ఎం అభ్యర్థులు ఎవరనేది తేల్చుకోవడం పెద్ద సవాల్ గానే ఉంది. కాంగ్రెస్, బిజెపి పార్టీల నుంచి కే‌సి‌ఆర్ ను ఢీ కొట్టే అభ్యర్థి ఎవరో చూడాలి.

Also Read: నో డౌట్.. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు !

- Advertisement -