పోక్సో చట్టం..స్త్రీ పురుషులనే వివక్ష లేదు!

5
- Advertisement -

పోక్సో చట్టానికి స్త్రీ పురుషులనే వివక్ష లేదు అని అభిప్రాయపడింది కర్ణాటక హైకోర్టు. లైంగిక వేధింపులకు పాల్పడితే ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే…పోక్సో చట్టంపై స్పష్టతనిచ్చింది కర్ణాటక హైకోర్టు. కర్ణాటకలో 13 ఏళ్ల బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ 48 ఏళ్ల ఉపాధ్యాయురాలిపై పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు.

తనపై నమోదైన పోక్సో కేసును కొట్టివేయాలని కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది మహిళ. ఈ కేసు విచారిస్తూ పోక్సో చట్టానికి లింగ వివక్ష ఉండదని, నేరం చేసింది పురుషులైనా, మహిళలైనా సమాన శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టం చేసింది కర్ణాటక హైకోర్టు జస్టిస్ ఎం.నాగప్రసన్న.

దేశంలో లైంగిక వేధింపులకు గురవుతున్న వారిలో 54.4% బాలురు, 46.6% బాలికలు ఉంటున్నారని పేర్కొన్నారు హైకోర్టు న్యాయమూర్తి.ఐపీసీలోని అత్యాచార చట్టం తరహాలోని కేవలం పురుషులని మాత్రమే నిందితులుగా నిర్ధారించాలని కోరారు నిందితురాలి తరపు న్యాయవాది. ఈ వాదనను తిరస్కరిస్తూ పోక్సో కేసులో లైంగిక వేధింపులు అనేది ఐపీసీలో అత్యాచారం లాంటిది కాదని స్పష్టం చేశారు న్యాయమూర్తి. తగిన ఆధారాలు సేకరించి నిందితురాలికి వెంటనే శిక్ష విధించాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది కర్ణాటక హైకోర్టు.

Also Read:మిస్ యూనివర్స్ ఇండియాగా మణిక

- Advertisement -