Karnataka Elections:బీజేపీకి షాక్.. కోలుకోవడం కష్టమే !

48
- Advertisement -

కర్నాటక ఎన్నికల దగ్గర పడుతున్న వేల బీజేపీకి వరుస షాకులు తగులుతున్నాయి. అభ్యర్థుల ప్రకటనలో చాలమంది సీనియర్స్ ను పక్కన పెట్టి కొత్తవారికి ఛాన్స్ ఇచ్చిన కమలం పార్టీకి సీనియర్స్ ఊహించని షాక్ ఇస్తున్నారు. టికెట్ ఆశించగా అధిష్టానం మొండి చేయి చూపడంతో ఒక్కరూగా పార్టీ వీడుతూ ఇతర పార్టీల గూటికి చేరుకుంటున్నారు. ఇప్పటికే పలువురు నేతలు కాంగ్రెస్ మరియు జేడీఎస్ పార్టీల గూటికి చేరగా ఇప్పుడు బీజేపీ సీనియర్ నేత మాజీ సి‌ఎం జగదీష్ షెట్టర్ కూడా బీజేపీకి టాటా చెప్పారు. సీట్ల కేటాయింపులో బిజేపీ తర్జనభర్జన పడుతున్నప్పటికి.. తనకు కచ్చితంగా టికెట్ వస్తుందని ఆశించారు జగదీష్ సెట్టర్. .

కానీ ఊహించని విధంగా కాషాయ పార్టీ ఆయనను పక్కన పెట్టేసింది దీంతో పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కిన జగదీష్ బిజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ గూటికి చేరారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో ఆయన హస్తం కండువా కప్పుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆశక్తికాంరగా మారాయి. పార్టీ కోసం ఎంతో కృషి చేసినప్పటికీ బిజేపీ అధిష్టానం తనను గుర్తించలేదని, ఒక్కమాట కూడా చెప్పకుండా టికెట్ నిరాకరించారని, ప్రస్తుతం బిజేపీ కొందరి అధీనంలోనే ఉందని వారి నిర్ణయాలతోనే పార్టీ నడుస్తోందని వ్యాఖ్యానించారు జగదీష్ సెట్టర్. కాగా బిజేపీలోని సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా పార్టీ వీడుతుండడం ఆ పార్టీని కలవరపెట్టే అంశం.

అసలే కొత్తవారికి అవకాశం కల్పిస్తున్నా నేపథ్యంలో సీనియర్స్ అంతా పార్టీకి దూరమైతే అది గెలుపోటములపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పటికే బిజేపీపై ప్రజల్లో వ్యతిరేక ఉందని ఈసారి ఎన్నికల్లో కమలం పార్టీ గెలవడం కష్టమే అని సర్వేలు చెబుతున్నాయి. ప్రజాదరణ కూడా కాంగ్రెస్ వైపే ఎక్కువగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీలోని అసమ్మతి నేతలు పార్టీకి టాటా చెబుతుండడం బిజేపీ మరింత కలవర పెట్టె అంశం. మరి ఇంతటి వ్యతిరేక పరిస్థితుల మద్య కాషాయ పార్టీ ఎలా గట్టెక్కుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -