మెగాస్టార్ తో భారీ ఫాంటసీ డ్రామా

32
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి హీరోగా యువ దర్శకుడు దర్శకత్వంలో ఓ భారీ ఫాంటసీ మూవీ చేయనున్నారని ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది. ఇంతకీ ఆ యంగ్ డైరెక్టర్ ఎవరు ?, అతనెవరో కాదు.. బింబిసార సక్సెస్ తో మంచి పేరు సొంతం చేసుకున్న వశిష్ట. ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్ట్ కోసం వశిష్ట కథ రెడీ చేస్తున్నారు. బింబిసార దర్శకుడు వశిష్ట తో ఓ సినిమా చేయడానికి మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. గతంలో తన ఫ్యామిలీతో కలిసి బింబిసార చిత్రాన్ని చూసిన మెగాస్టార్ చిరంజీవికి సినిమా బాగా నచ్చిందట. పైగా వశిష్ట మెగాస్టార్ చిరంజీవి అభిమాని. అందుకే, మెగాస్టార్ ఛాన్స్ ఇచ్చాడని తెలుస్తోంది.

ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ భోళా శంకర్ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా భారీ సక్సెస్ కావాలంటే.. సిస్టర్ సెంటిమెంట్ తో పాటు భారీ యాక్షన్ టచ్ కూడా ఉండాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. అందుకే.. తమిళ సినిమా రీమేక్ అయినప్పటికీ.. రాయలసీమ ఫ్యాక్షన్, మైనింగ్ ఇలాంటి వ్యవహారాలను ఈ చిత్రంలో జోడించబోతున్నారు. ఈ సీన్స్ లో మెగాస్టార్ మాస్ ఎలివేషన్లు హైలైట్ గా ఉంటాయట. అన్నట్టు భోళా శంకర్ సినిమా తర్వాత మెగాస్టార్ చేయబోయే సినిమా వశిష్టతోనే అని తెలుస్తోంది.

ఎలాగూ దర్శకుడు వశిష్టకి మాస్ ఎలివేషన్లు బాగా హ్యాండిల్ చేస్తాడని మంచి పేరు తెచ్చుకున్నాడు. పైగా ఇలాంటి మాస్ ఎలివేషన్లలో మెగాస్టార్ చిరంజీవి కూడా అదిరిపోతారు. గతంలో చిరు సినిమాలు హిట్ అయిందే ఆ ఎలివేషన్లతో. మొత్తానికి ఇన్నాళ్లకు మళ్లీ మెగాస్టార్ ఫుల్ ఎలివేషన్లలో ఓ భారీ ఫాంటసీ మూవీ చేయబోతున్నాడు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -