కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకత్వ మార్పుపై గత కొన్ని రోజులుగా సాగుతున్న రాజకీయ ఊహాగానాలపై రాష్ట్ర హోం మంత్రి జీ పరమేశ్వర బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానంతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య జరిపిన అంతర్గత చర్చల వివరాలు ఎవరికీ తెలియవని ఆయన స్పష్టం చేశారు.
అయితే, ఈ గందరగోళానికి తెరదించేందుకు ఏఐసీసీ (AICC) కర్ణాటక ఇన్‌ఛార్జ్ రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా గురువారం స్పష్టత ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
మీడియాతో మాట్లాడిన పరమేశ్వర… నిన్న అధిష్టానం పిలుపు మేరకు సీఎం సిద్ధరామయ్య ఢిల్లీ వెళ్లి అగ్రనేతలను కలిశారు కానీ ఆ మూసిఉన్న తలుపుల వెనుక ఏం చర్చించారనేది ఎవరికీ తెలియదు అని చెప్పుకొచ్చారు.
మాకు కూడా ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు అన్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అధికారికంగా చెప్పిన విషయాలు మాత్రమే మాకు తెలుసు…. రాష్ట్ర ఇన్‌ఛార్జ్ రణ్‌దీప్ సూర్జేవాలా ఈరోజు బెంగళూరు వస్తున్నారు అన్నారు.
Also Read:పెద్ది..చరణ్ విశ్వరూపం చూస్తారు!

