అకాల వర్షాలతో దెబ్బతిన్న రైతన్నలకు అండగా నిలవాలి అని బీఆర్ఎస్ శ్రేణులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల వల్ల మార్కెట్ యార్డుల్లో తమ ధాన్యం, మక్కలను కోల్పోతున్నారు రైతన్నలు.
అకాల వర్షాల వల్ల ప్రభావితమైన అన్ని మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాలను పార్టీ శ్రేణులు తక్షణమే సందర్శించాలి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత, ముందుచూపు లేకపోవడం వల్లే నేడు రైతన్నలకు ఈ దుస్థితి వచ్చింది అన్నారు.
మార్కెట్ యార్డుల్లో తడిసిన వరి, మొక్కజొన్న తదితర ధాన్యాన్ని తేమ శాతం, తరుగు అనే సాకులు లేకుండా ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేయాలి.. మిగిలిన ధాన్యాన్ని కాపాడుకోవడానికి రైతులకు సరిపడా టార్పాలిన్ కవర్లను తక్షణమే సరఫరా చేయాలి అన్నారు. వెంటనే మార్కెట్ యార్డులలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలి.. పంట కొనుగోలు పైన ప్రత్యేక దృష్టి సారించి, అన్నదాతలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Also Read:విజయన్‌కు షాక్..ఈడీ రైడ్స్!

