TTD:సర్వభూపాల వాహనంపై గోవిందుడు

1
- Advertisement -

తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయం బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన మంగళవారం రాత్రి శ్రీ గోవిందరాజస్వామివారు సర్వభూపాల వాహనంపై విహరించి భక్తులను అనుగ్రహించారు. రాత్రి 7 గంటలకు ప్రారంభమైన వాహనసేవ భక్తి పారవశ్యంతో వైభవంగా సాగింది. గోవింద నామస్మరణలతో మారుమోగిన మాడవీధుల్లో భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారి దివ్య మంగళ రూపాన్ని దర్శించుకున్నారు.

సర్వభూపాల అంటే సమస్త రాజులు, దిక్పాలకులు అని అర్థం. సర్వలోకాల అధిపతిగా శ్రీహరి అందరి హృదయాల్లో కొలువై ఉంటాడని ఈ వాహనసేవ సూచిస్తుంది. స్వామివారిని తమ భుజస్కంధాలపై మోసే దిక్పాలకులు భగవత్సేవలో నిమగ్నమై ప్రజలను ధర్మబద్ధంగా పాలిస్తారని ఈ వాహనసేవ ద్వారా ఆధ్యాత్మిక సందేశం అందుతుంది.

టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్ట్‌, దాససాహిత్య ప్రాజెక్ట్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన భక్తి సంగీత, హరికథ, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాలతో తిరుపతి మాడవీధులు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.

బుధవారం ఉదయం 5 గంటల నుండి 9 గంటల వరకు పల్లకీ ఉత్సవం (మోహినీ అవతారోత్సవం) వైభవంగా జరుగనుంది. అనంతరం రాత్రి గరుడవాహనంపై శ్రీ గోవిందరాజస్వామివారు విహరించి భక్తులకు దివ్య దర్శనమివ్వనున్నారు.

Also Read:పెద్ది..చరణ్ విశ్వరూపం చూస్తారు!

- Advertisement -