కర్ణాటక సీఎం సిద్దరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు సర్దుబాటు రాజకీయాలు తెలియవని ఒకవేళ అలాంటి రాజకీయాలు చేసినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని వెల్లడించారు. 1983 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నానని, అప్పటి నుంచి రాజకీయాల్లో విలువలు కాపాడుకుంటూ వస్తున్నానని అన్నారు.
రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై బుధవారం చర్చలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి పాల్గొన్న జేడీఎస్ చీఫ్, మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
సిద్ధరామయ్య సర్దుబాటు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించగా వెంటనే స్పందించిన సిద్దరామయ్య.. సర్దుబాటు రాజకీయాలు తనకు ఏమాత్రం గిట్టవని స్పష్టం చేశారు. ప్రతిపక్షనాయకుడిగా ఉన్న సమయంలోనూ అప్పటి ముఖ్యమంత్రులు, మంత్రుల ఇళ్లకు వెళ్లలేదని స్పష్టం అన్నారు.
Also Read:పవన్‌కు వాలెంటరీ ఎఫెక్ట్..?