- Advertisement -
కరీంనగర్ లోని రెడ్ జోన్ ప్రాంతాల్లో పర్యటించారు కలెక్టర్ శశాంక, సీపీ కమలాసన్ రెడ్డి.పట్టణంలోని పలు వీధుల్లో తిరుగుతూ కరోనాపై ప్రజలకు ఉన్న అవగాహన గురించి అడిగి తెలుసుకున్నారు. మీరు ఇంట్లో ఎందుకు ఉండాల్సి వస్తుందో తెలుసా? ఎన్ని రోజుల నుంచి బయటికి రావడం లేదు? అంటూ పలు పశ్నలు అడిగారు కలెక్టర్ శశాంక.
రెడ్ జోన్ ప్రాంతాల్లో ఇంటింటికి కూరగాయలు, నిత్యవసర సరుకులను అందించారు అధికారులు. మార్చి 31వరకు ప్రజలు ఎవరు రోడ్లపైకి రాకూడదని తెలిపారు. కాగా కరీంనగర్ లో కరీంనగర్ లో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. అత్యవసరం అయితేనే ప్రజలు భయటకు రావాలని పిలుపునిచ్చారు.
- Advertisement -