- Advertisement -
తెలంగాణ ఎంసెట్, ఈసెట్-2020 నోటిఫికేషన్ దరఖాస్తుల గడువు తేదీని పొడగిస్తున్నట్లు ప్రకటించింది రాష్ట్ర విద్యా మండలి. ఎంసెట్ దరఖాస్తు గడువు ఈ నెల 30తో, ఈసెట్ దరఖాస్తు గడువు 28వ తేదీతో ముగియనుంది.
కాగా ఎంసెట్ దరఖాస్తు గడువును ఏప్రిల్ 7వ తేదీ వరకు, ఈసెట్ దరఖాస్తు గడువును ఏప్రిల్ 5వ తేదీ వరకు పొడిగించారు. కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోన్న నేపధ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించడంతో విద్యా శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
- Advertisement -

