పార్టీ బలోపేతానికి కృషిచేయండి: కేటీఆర్

56
ktr
- Advertisement -

గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కరీంనగర్ జిల్లా పార్టీ అధ్యక్షునిగా జివి రామకృష్ణారావును నియమించిన విషయం విధితమే. శుక్రవారం ఉదయం మంత్రి గంగుల నూతన అధ్యక్షునితో పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గారిని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ నూతన అధ్యక్షునికి అభినందనలు తెలియజేశారు, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు, సమర్థుడైన మంత్రి గంగుల కమలాకర్ రూపంలో అండగా ఉన్నారని, సుశిక్షితులైన కార్యకర్తలతో కరీంనగర్ గులాబీ సేన పటిష్టంగా ఉందని రాబోయే రోజుల్లో పార్టీ కోసం మరింత తీవ్రంగా శ్రమించి అప్రతిహత విజయాల్ని అందుకోవాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి మంత్రి గంగుల కరీంనగర్ జిల్లాకు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని కేటీఆర్ గారికి విజ్ఞప్తి చేశారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిరంతరం కరీంనగర్ కు అండగా ఉన్నారని టిఆర్ఎస్ ప్రభుత్వంలో కరీంనగర్ అద్భుతంగా అభివృద్ధి చెందుతుందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ నూతన అధ్యక్షులు జీవి రామకృష్ణ రావు, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, ఒడితల సతీష్, ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు

- Advertisement -