కరీంనగర్‌లో 76వేల మందికి స్క్రీనింగ్

263
corona ts
- Advertisement -

తెలంగానలో కరోనా కేసులు 19కి చేరాయి. ఇక ఇండోనేషియా నుంచి కరీంనగర్ వచ్చిన వారికి కరోనా పాజిటివ్ తేలడంతో కలెక్టరేట్ నుండి 3 కిలోమీటర్ల పరిధిలో పెద్ద ఎత్తున స్క్రీనింగ్ నిర్వహించారు అధికారులు. ఇప్పటివరకు 76 వేల మందికి స్క్రీనింగ్ నిర్వహించారు.

ఇక మూడో రోజూ శనివారం కరోనా వైరస్‌ స్క్రీనింగ్‌ ఉధృతంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం 13వేల 428 ఇళ్లలో 76వేల 910 మందికి స్క్రీనింగ్‌ నిర్వహించారు. 23 మంది వివిధ దేశాల నుంచి వచ్చినట్టు గుర్తించారు. 34 మందికి స్వల్ప ఆరోగ్య సమస్యలు(జలుబు, దగ్గు) ఉండటంతో హోం క్వారంటైన్‌ చేసినట్టు మంత్రి గంగుల కమలాకర్‌ వెల్లడించారు.

కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా మార్చి 1 నుంచి ఇప్పటివరకు 374 మంది వివిధ దేశాల నుంచి వచ్చినట్టు గుర్తించామని, వీరి ఎడమ చేయిపై ప్రత్యేక స్టాంపు ముద్రించాలని నిర్ణయించినట్టు తెలిపారు. 60 డివిజన్లలో శానిటేషన్ డ్రైవ్ కొనసాగుతోందన్నారు. ఇండోనేషియా నుంచి వచ్చిన 12 మందిలో 10 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది.

- Advertisement -