- Advertisement -
మాజీ మంత్రి ఈటల రాజేందర్ త్వరలో బీజేపీలో చేరుతారన్న వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆదిశగా ప్రయత్నాలు చేస్తుండగా కరీంనగర్ జిల్లా బీజేపీ నేతలు మాత్రం ఈటల రాకను వ్యతిరేకిస్తున్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి బహిరంగంగానే ఈటల బీజేపీ చేరికపై అసహనం వ్యక్తం చేశారు.
ఒకవేళ ఈటల బీజేపీలో చేరితే ఆయన పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. పార్టీలో తనకు ఒక్క మాట చెప్పకుండా ఈటలను ఎలా చేర్చుకోవాలని నిర్ణయిస్తారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈటల బీజేపీలో చేరిన పక్షంలో పెద్దిరెడ్డి టీఆర్ఎస్లోకి వెళ్లడం ఖాయమని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. గతంలో హుజూరాబాద్ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా కొనసాగిన పెద్దిరెడ్డి తెలంగాణ ఉద్యమ సమయంలో 2004 టీడీపీ అభ్యర్థిగా ఓడిపోయారు. అప్పటినుండి ఆయన పోటీచేసిన ప్రతీసారి ఓడిపోయారు.
- Advertisement -