ఫామ్‌లోకి వచ్చేసింది !

251
Kareena Kapoor Khan is grabbing eyeballs
Kareena Kapoor Khan is grabbing eyeballs
- Advertisement -

బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ తన అద్భుతమైన బాడీ షేప్ తో, జీరో ఫిగర్ తో అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఉంది. సైఫ్ అలీ ఖాన్ ను పెళ్లి చేసుకొని ఒక పిల్లాడిని కన్న తరువాత కూడా.. మళ్ళీ తిరిగి సినిమాల్లోకి వెంటనే వచ్చేస్తానంటోంది. కరీనాకు గర్భం రావడం వల్ల కరీనా కొద్దిగా లావైంది.. శరీరాన్ని తిరిగి సాధారణ స్థాయికి తెచ్చుకునేందుకు కరీనా బాగానే కష్టపడుతోంది. ఇటీవల తుషార్ కపూర్ కుమారుడు లక్ష్య తొలి పుట్టిన రోజు వేడుకలో కరీనా కపూర్ అందం చూసి పలువురు ప్రముఖులు ఆశ్చర్యానికి గురయ్యారట. వీర్ ది వెడ్డింగ్ సినిమాకు రెడి అవుతున్న కరీనా మలేషియాలో ఓ షాపింగ్‌ మాల్‌ ఒపెనింగ్ సంధర్బంగా తీసిన ఈ ఫోటోలో మెరిసిపోయింది కరీనా. ఈ డ్రెస్‌లో తన స్టైల్ లో కొద్దిగా క్లీవేజ్ అందాలను కూడా ఆరబోసేస్తూ.. మళ్లీ గ్లామర్ రూట్ లోకి తను వచ్చేస్తున్నట్లు చెప్పకనే చెప్పింది.

kareena-kapoor

కొన్నినెలల క్రితమే మగబిడ్డకు జన్మనిచ్చి, కేవలం ఆరు నెలల్లోనే బరువు తగ్గి, మరింత కాంతివంతంగా కనిపించడంతో మళ్లీ పాత కరీనాను చూస్తారు అని లుక్కులతోనే చెప్పేస్తోంది. కరీనాను చూసినవాళ్లు.. బెబో ఈజ్ బ్యాక్ అనుకుంటున్నారు. కొద్దికొద్దిగా మళ్లీ తన పాత షేప్‌ను తెచ్చేసుకుంటున్న కరీనాకి.. పాత లుక్.. కొన్ని వంపులు రావాలంటే పెద్దగా సమయం పట్టకపోవచ్చు. ఇక అమ్మడుకి ఒక ఆఫర్ కూడా వచ్చేసింది. ఈ మూవీ కి ఏకంగా ఆరు కోట్లు ఆఫర్ చేశారట ప్రొడ్యూసర్లు. 36 ఏళ్ల ఈ బార్బీ డాల్ సుందరి ఇప్పుడు ‘వీర్ ది వెడ్డింగ్’ అనే సినిమా చేస్తుంది. ఈ సినిమా ను ఏక్తా కపూర్ మరియు రియా కపూర్ నిర్మిస్తున్నారు

- Advertisement -