రాజ్యసభ సభ్యులు ఎంపీ, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన 3వ విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలో ఎంపీపీ రేగా కాళికా మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగస్వామ్యం కావడం ఎంతో సంతోషం, ఇది పర్యావరణ పరిరక్షణకు ఒక నిజమైన చాలెంజ్.. ఎందుకంటే ఆక్సిజన్ కేంద్రాలు నెలకొల్పే పరిస్థితి మనకు వచ్చింది అంటే మనం మొక్కలు నాటడం, పెంచడం బాధ్యతగా తీసుకోవాలి అన్నారు. మొక్కలు నాటి వాటిని సంరక్షించడం వల్ల నేల తల్లికి అలాగే మన సమాజానికి ఎంతో ఉపయోగకరమని, మనమందరం ఆరోగ్యకరంగా ఉండాలంటే మొక్కలు నాటడం చాలా అవసరమం. కాబట్టి అందరం కూడా మొక్కలు పెంచే బాధ్యత తీసుకోవాలన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక హరితహారానికి మద్దతు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టి ప్రజలలో మంచి అవగాహన కల్పిస్తూ, చెట్లు నాటే విధంగా ప్రోత్సహిస్తున్నారు. ఇంతటి అద్భుతమైన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ప్రారంభించిన రాజ్యసభ సభ్యులు ఎంపీ, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగినిపల్లి సంతోష్ కుమార్‌కు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావుకి ఎంపీపీ రేగా కాళికా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.