పునీత్‌ కలల ప్రాజెక్ట్‌..

168
- Advertisement -

కన్నడ పవర్‌ స్టార్‌ దివంగత పునీత్‌ రాజ్‌కుమార్‌ చివరిగా నటించిన గంధదగుడి. కర్ణాటకలోని పశ్చిమకనుమలలోని కర్ణాటక అడవుల అందాలను ఓడాక్యుమెంటరీ డ్రామాగా అమోఘవర్ష తెరకెక్కించారు. పునీత్‌ భార్య ఆశ్విని పునీత్‌కుమార్‌ గంధద గుడికి నిర్మాతగా వ్యవహరించారు.

ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పునీత్‌ భార్య ఈ సందర్భంగా స్పందిస్తూ పునీత్‌ చివరి సినిమా అయిన గంధద గుడిని కన్నడ ప్రజలందరూ చూడాలని అది తన చివరి కోరిక అని అన్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఇదే విషయాన్ని కర్ణాటక ప్రజలకు ఓ లేఖ కూడా రాశారు. దానిని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

గంధద గుడి పునీత్‌ రాజ్‌కుమార్‌ కలల సినిమా. కర్ణాటక అడవుల అందాలు అందరికీ చూపించాలని ఆయన ఈ సినిమా చేశారు. కన్నడ ప్రజలందరూ ఈ సినిమా చూడాలన్నది పునీత్‌ కోరిక. చిన్న పిల్లలు ఎక్కువగా చూడాలని అప్పూ కోరుకున్నాడు. మన బిడ్డల కోసం మన అడవులను కాపాడుకుందాం. కర్ణాటక అందాలను వాళ్లకు చూపిద్దాం అని లేఖలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి..

దక్షిణాదికి తొలి వందేభారత్‌ ట్రైన్

కేజీఎఫ్‌ ౩….యశ్ క్లారిటీ!

హ్యపీ బర్త్ డే…స్వీటీ అనుష్క

- Advertisement -