క్రికెట్‌లో రిజర్వేషన్లు కావాలంటున్న హీరో

51
- Advertisement -

‘క్రికెట్‌లో రిజర్వేషన్లా ?, నిజంగా ఉండి ఉంటే భారత జట్టు గెలిచేదా ?, అసలు రిజర్వేషన్లు ఎందుకు ఉండాలి?, సామాన్య యువకుల్లోని టాలెంట్ ను గుర్తించాలి అంటే.. రిజర్వేషన్లు ఉండాల్సిందేనా ?, కన్నడ నటుడు చేతన్ కుమార్ ఈ వాదన తెరపైకి తీసుకొచ్చాడు. చేతన్ కుమార్ ఏ ఉద్దేశ్యంతో చెప్పాడో గానీ, ఈ రిజర్వేషన్లు కులాలను బట్టి కాకుండా.. టాలెంట్ ను బట్టి ఉంటే కచ్చితంగా ఇండియా క్రికెట్ కి ఎంతో మంచి జరుగుతుంది. నిజమే.. గొప్ప టాలెంట్ ఉన్నవాళ్లు ఇంకా గల్లీలోనే ఆడుతున్నారు. వారికి అవకాశాలు రావడం లేదు. దానికి కారణం ఫలానా అని చెప్పడం కూడా కష్టమే.

కానీ, ఒక్కటి మాత్రం నిజం. రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్న వారిని తప్పు పట్టడానికి కుదరదు. వారి ఆలోచనా విధానం తప్పు కావొచ్చు. కానీ, సరైన టాలెంట్ కి అవకాశం ఇవ్వడంలో మాత్రం మన వ్యవస్థలు ఫెయిల్ అయ్యాయి. ఇంత పెద్ద భారత్ దేశంలో ఎంతమంది సచిన్ లు పుట్టాలి?, ఎంతమంది యువరాజ్ సింగ్ లు పైకి ఎదగాలి?, దోని, కోహ్లీ లాంటి వారికి వచ్చిన అవకాశాలు అందరికీ రావు. సచిన్ కొడుక్కి ఇచ్చే అవకాశం, ఓ సామాన్య యువకుడికి ఇవ్వరు. అందుకే, రిజర్వేషన్లు లాంటి వాటిని తెర పైకి తెస్తున్నారు.

ఏది ఏమైనా, 2023 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ఫైనల్ పోరులో భారత్ ఓటమి పాలైన తర్వాత.. ఈ రిజర్వేషన్ల అవసరం ఉందేమో అనిపిస్తోంది. కానీ, కులాల వారీగా, ప్రాంతాల వారీగా రిజర్వేషన్లు ఉండకుండా.. టాలెంట్ ఉన్న పేదవారికి ప్రోత్సాహం అదించే విధంగా రిజర్వేషన్లు ఉంటే, కచ్చితంగా మన ఇండియన్ క్రికెట్ కి మేలు జరుగుతుంది. ఐతే, కన్నడ నటుడు చేతన్ కుమార్ ది వింత వాదన అని అనేవాళ్ళు కూడా ఉన్నారు.

ఇంతకీ, ఈ కన్నడ హీరో ఏం చెప్పాడు అంటే.. క్రికెట్‌లో రిజర్వేషన్లు ఉండి ఉంటే భారత జట్టు తప్పక ప్రపంచ కప్‌ గెలిచేదని పేర్కొన్నాడు. భారతదేశానికి క్రికెట్‌లో రిజర్వేషన్లు అవసరమని నొక్కి చెప్పాడు. అందుకు దక్షిణాఫ్రికా జట్టును అతడు ఉదాహరణగా చూపాడు. చేతన్ కుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట పెద్ద దుమారాన్ని రేపుతోంది.

Also Read:KCR:త్వరలో గిరిజన బంధు

- Advertisement -