సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్‌లుగా నటిస్తున్న తాజా చిత్రం గుంటూరు కారం. వచ్చే సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం త్రివిక్రమ్ ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను రంగంలోకి దింపనున్నాడని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాగా, పవన్ ఈ సినిమాలో మరి గెస్ట్ రోల్ చేస్తున్నాడో.. లేక త్రివిక్రమ్, మహేష్ కోసం తన వాయిస్‌ను వినిపిస్తున్నాడో చూడాలి. ఇక తాజాగా ఈ మూవీ నిర్మాత నాగవంశీ ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ రిలీజ్ పై స్పష్టతనిచ్చారు.
వచ్చే వారం గుంటూరు కారం నుంచి రెండో సింగిల్ రిలీజ్ చేయనున్నట్లు నాగవంశీ తెలిపాడు. సినిమాలో మొత్తం నాలుగు సాంగ్స్ ఉన్నాయని, మిగిలిన సాంగ్స్‌ని త్వరలోనే ఒక్కొక్కటిగా ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చేస్తామని వెల్లడించారు. కాగా, ఈమూవీ జనవరి 12న రిలీజ్ కానుంది. మరి ‘గుంటూరు కారం’ సెకండ్ సింగిల్ ఎలా ఉంటుందో. ఫస్ట్ సాంగ్ అయితే ఆశించిన స్థాయిలో లేదు. అందుకే, ఆ సాంగ్ పెద్దగా ట్రెండింగ్ లోకి వెళ్ళలేక పోయింది. సహజంగా మహేష్ – త్రివిక్రమ్ అనగానే సాంగ్స్ చాలా బాగుంటాయి. కానీ గుంటూరు కారం సాంగ్స్ మాత్రం ఆ స్థాయిలో ఉండటం లేదని టాక్.
త్రివిక్రమ్ మాత్రం ఈ సినిమా పై హైప్ ను పెంచడానికి అన్నీ రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాపై మరో ఇంట్రెస్టింగ్ బజ్ కూడా వినిపిస్తోంది. ఈ సినిమాలో మరో ముఖ్యమైన పాత్ర కోసం మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ను రంగంలోకి దింపుతున్నట్లు టాక్. అయితే మోహన్ లాల్, మహేష్ బాబుకు పోటీగా దిగుతాడా? లేదా తోడుగా ఉంటాడా? అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఏది ఏమైనా గుంటూరు కారంలో ఘాటు బాగానే ఉండేలా ఉంది.
Also Read:KCR:త్వరలో గిరిజన బంధు

