బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మణికర్ణిక. విజువల్ వండర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టిన మణికర్ణిక తాజాగా బుచియన్ ఇంటర్నేషనల్ ఫెంటాస్టిక్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైంది.
ఈ సందర్భంగా మాట్లాడిన కంగనా బుచియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు మణికర్ణిక ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు ఈ సినిమాను మెచ్చుకోలేదని, ఇప్పుడు ఈ ఘనత సాధించడం వారికి చెంప పెట్టులాంటిదని పేర్కొన్నారు.
మూవీ మాఫియానా సినిమాను చంపేయాలి అనుకుంది. కానీ , సినిమా కమర్షియల్ హిట్ అందుకుంది. ఇప్పుడు అంతర్జాతీయంగా చిత్రానికి గుర్తింపు లభించిందన్నారు. సోషల్‌మీడియా ద్వారా ప్రపంచం మొత్తం ఒక్కటైన ఈ కాలంలో ఒక సినిమాను అణచివేయాలనే పని సాధ్యం కాదన్నారు.
ప్రస్తుతం పంగా సినిమా షూటింగ్‌కు కాస్త విరామం తీసుకుని ఫ్యామిలీతో హాలీడే ట్రిప్‌ని ఎంజాయ్ చేస్తోంది కంగనా. ఇక కంగన నటించిన ‘మెంటల్ హై క్యా’ సినిమా జులై 26న విడుదల కాబోతోంది.