సెక్స్ కోసం తపించే పాత్రలో కంగన..

319
- Advertisement -

ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్‌ ఇటీవల చేసిన కామెంట్స్‌ దుమారం లేపుతున్న సంగతి తెలిసిందే. ఆదిత్య పంచోలీపై కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. నటిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కొత్తలో మైనర్‌గా ఉన్న తనను పంచోలీ తీవ్రంగా హింసించాడని, రక్తం వచ్చేలా కొట్టాడని ఆరోపించారు. అయితే కంగనాకు పిచ్చిపట్టిందని. అందుకే అలా మాట్లాడుతోందని.. ఆమెను అంత సామాన్యంగా వదిలిపెట్టనని.. చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆదిత్య పంచోలి అన్నారు.

Kangana Ranaut to play intense role in Simran

ఈ నేపథ్యంలో త్వరలోనే ”సిమ్రాన్” అనే సినిమాతో మన ముందుకు రాబోతుంది కంగనా రనౌత్. ఈ సినిమా గురించి ఆల్రెడీ తన వివాదాస్పద ప్రమోషన్లతో రచ్చ లేపుతున్న కంగన.. ఇప్పుడు సినిమా కంటెంట్ ఎలా ఉండబోతుందో కూడా చెబుతోంది. ఆల్రెడీ పాటలను చూస్తే.. ఏంటి కంగన చాలా ఓవర్ గా క్లీవేజ్ షోలు చేసింది అనే సందేహం రాకమానదు. ఈ సినిమాలో అమ్మడు పెళ్ళయ్యి డైవర్స్ తీసుకున్నాక.. సెక్స్ కోసం పరితపించే ఒక మహిళగా నటించిందట. చాలామంది అబ్బాయిలను మార్చుతూ ఎప్పుడూ కొత్తకొత్తగా సెక్స్ ను ఎంజాయ్ చేయాలనుకునే పాత్రలో నటిస్తుందట.

గతంలో ఓసారి రివాల్వర్ రాణి సినిమాలో ఇదే తరహాలో సెక్స్ కోసం పిచ్చెక్కిపోయే పాత్రలో నటించింది కంగన. కాని ఆ సినిమా డిజాష్టర్ అయ్యింది. మనోళ్ళు అలాంటి ఎడల్ట్ సెన్స్ ఉన్న కంటెంట్ ను అంతగా ఒప్పుకోవట్లేదనే చెప్పాలి. మరి సెప్టెంబర్ 15న వస్తున్న ”సిమ్రాన్” తన సెక్స్ ఎడ్వెంచర్స్ తో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

- Advertisement -