పుణెకు చెందిన 26 ఏళ్ల రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘోర ఘటనపై నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా స్పందించారు. పిల్లల పెంపకానికి వారు సమాజంలో చేసే పనులకు మధ్య ఉన్న సంబంధంపై ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. వయసొచ్చిన పిల్లలు చేసే నేరాలకు వారి తల్లిదండ్రులను బాధ్యులను చేయలేమని ఆమె స్పష్టం చేశారు.
ఈ నేరం జరిగిన తీరును ప్రస్తావిస్తూ ప్రస్తుతం సమాజంలో పిల్లల ప్రవర్తనకు కేవలం కుటుంబం నేర్పే సంస్కారాలు మాత్రమే కారణం కావడం లేదని కంగనా పేర్కొన్నారు. డిజిటల్ మరియు సోషల్ మీడియా వాతావరణం దీనిపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆమె అన్నారు.
ఈ రోజుల్లో కేవలం ఒక కుటుంబాన్ని, వారి ఇళ్లను లేదా తల్లిదండ్రులను చూసి పిల్లల సంస్కారాన్ని అంచనా వేయలేం. వారిని ఎవరు ప్రోగ్రామ్ (ప్రభావితం) చేస్తున్నారు? వారు ఎవరితో సమయం గడుపుతున్నారు? సోషల్ మీడియా, ఏఐ (AI) లేదా నిజ జీవితంలో వారిపై వేటి ప్రభావం ఉందనేది ఇక్కడ చాలా ముఖ్యం.” అని కంగనా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాశారు.ప్రస్తుత డిజిటల్ యుగంలో మనుషులు రెండు రకాల సమాంతర జీవితాలు గడుపుతున్నారని, అందువల్ల కుటుంబాలను తప్పుపట్టలేమని ఆమె వివరించారు.
Also Read:కేంద్రమంత్రికి CJP బర్త్ డే గిఫ్ట్!
కేతన్ అగర్వాల్ నిశ్చితార్థం చేసుకున్న 20 ఏళ్ల సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి కలిసి ఈ హత్యను ఒక ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించగా, పోలీసులు వారిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

