బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముక్కుసూటిగా మాట్లాడే ఆమె స్వభావంతో బీ టౌన్‌లో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకుంది. ఎలాంటి గ్లామర్ రోల్స్ పోషించేందుకైనా వెనుకాడని కంగనా… ‘తను వెడ్స్ మను’, ‘క్వీన్’ లాంటి సినిమాలతో టాప్ హీరోయిన్స్ జాబితాలో చోటు దక్కించుకుంది. తనదైన నటనతో జాతీయ అవార్డును సైతం గెల్చుకున్న ఈ ఉంగరాల జుట్టు చిన్నది ప్రస్తుతం రాణి లక్ష్మీభాయ్ అనే చారిత్రాత్మక సినిమాలో నటిస్తోంది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. తాను సినిమాల్లోకి రాకపోతే బ్లూ ఫిల్మ్‌లో నటించేదాన్నని తెలిపింది. అంతేగాదు సినిమాల్లోకి రావాలనుకునే అమ్మాయిలు చాలా జాగ్రత్తగా అన్నింటికీ సిద్ధపడి రావాలని చెప్పింది. సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్న వాళ్ళకు పెద్ద ఇబ్బంది ఉండదు కాని, కేవలం స్వయంకృషినే నమ్ముకుని సినిమా రంగంలో అడుగుపెడితే మాత్రం బాధలు తప్పవని చెప్తోంది. హీరోయిన్‌గా ఛాన్సిచ్చేందుకు ముందు ముందు వాడుకోవాలని చూస్తారని వెల్లడించింది.
2006లో ‘గ్యాంగ్‌స్టర్’ సినిమాతో కంగనా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆఫర్ కనుక వచ్చి ఉండకపోతే.. తాను ఓ చెత్త సినిమాతో కెరీర్ ను ప్రారంభించి ఉండేదానని పేర్కొంది. అప్పట్లో నేను 17, 18 ఏళ్ల చిన్న వయస్సులో ఉన్నాను. గ్యాంగ్ స్టర్ ఆఫర్ కనుక రాకపోయి ఉంటే నేను ఆ సినిమా చేసి ఉండేదాన్ని. అప్పట్లో నేను ఉన్న పరిస్థితులు ప్రతి సినిమాకు ఓకే చెప్పు అన్నట్టుగా ఉండేవి’ అని ఆమె పేర్కొంది.
‘కెరీర్ లో నాకు వచ్చిన ‘గ్యాంగ్‌స్టర్’ సినిమాతోనే బ్రేక్ వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే అంతకన్నా ముందు నాకో సినిమా ఆఫర్ వచ్చింది. అది ఏమంతా మంచి సినిమా కాదు. అయినా, పర్వాలేదు చేద్దామనుకున్నా. ఆ తర్వాత ఫొటోషూట్ కూడా చేశాను. ఆ తర్వాత కాస్ట్యూమ్ రోబ్ ఇచ్చారు. అందులో దుస్తులేమీ లేవు. దీంతో అది నీలిచిత్రమేమో అనిపించిందని తెలిపింది.