తండ్రి కాబోతున్న సల్మాన్..

139
Salman

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కాబోతున్నాడు. అదేంటి సల్మాన్‌కు పెళ్లేకాలేదు మరి తండ్రి ఎలా అవుతున్నాడు అనుకుంటున్నారు కదా..ఇది నిజజీవితంలో కాదు రీల్ లైఫ్‌ లో. సల్మాన్ త్వరలో చేయబోయే సినిమాలో 13ఏళ్ల అమ్మాయికి తండ్రిగా నటించబోతున్నాడట. ఇలాంటి పాత్రలు కాస్త రిస్కే అయినా..సినిమా కంటెంట్, అందులో సల్మాన్ క్యారెక్టర్ బాగుండడంతో చేయడానికి ఒప్పుకున్నాడట. ఈ విషయాన్ని సల్మానే ఓ ఇంటర్వ్యూ ద్వారా మీడియాతో పంచుకున్నారు.‘నా వయసు 30 ఏళ్లు ఉన్నప్పుడు ‘జబ్‌ ప్యార్‌ కిసీసే హోతాహై’లో తండ్రి పాత్రలో నటించా. దాదాపు 19 ఏళ్ల తర్వాత ఇప్పుడు నా నెక్ట్స్ చిత్రంలో 13 ఏళ్ల అమ్మాయికి తండ్రి పాత్ర పోషిస్తున్నాడు.

Salman

ఈ చిత్రం డ్యాన్స్‌ అంశంపై తెరకెక్కుతోంది. ఓ విధంగా చెప్పాలంటే.. హాలీవుడ్‌ స్టెప్‌ అప్‌ ఫ్రాంచైస్‌లా ఉంటుంది. నేను డ్యాన్స్‌ ట్రైనర్‌గా నటిస్తున్నా. మీకు తెలుసు అది ఎంత కష్టమో? నేను ఈ పాత్ర కోసం 18 కిలోల బరువు తగ్గాల్సి ఉంది. నేను డైట్‌ పాటించడం లేదు.. ఇంటి భోజనం తింటున్నా. 18 కిలోల కండరాలను కరిగించడం అంత సులభం కాదు. కానీ కష్టపడితే దాని ప్రతిఫలం స్క్రీన్‌పై కనపడుతుందని నమ్ముతా’ అని సల్మాన్‌ అన్నారు. అంటే దాదాపు 19 ఏళ్ల తర్వాత సల్మాన్ ఖాన్ తండ్రి పాత్రలో కనిపించబోతున్నాడనమాట.

దంగల్‌ లో అమీర్‌ ఖాన్‌ పోషించిన తండ్రి క్యారెక్టర్‌ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. నటన పరంగా కూడ అమీర్ మరో ఎక్కాడు. మరి సల్మాన్ ఎలా ఆకట్టకుంటాడో చూడాలి.