కరోనా వ్యాక్సిన్‌ సురక్షితమైంది: కమల హ్యారిస్

227
kamala
- Advertisement -

కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా టీకా వేసుకునేలా ప్రతి ఒక్కరికి ప్రోత్సహించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు అమెరికా వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన కమలా హ్యారిస్. మంగళవారం కరోనా వ్యాక్సిన్ తీసుకున్న కమలా…వ్యాక్సిన్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వ్యాక్సిన్‌ తీసుకున్నట్లు పేర్కొన్నారు.

వ్యాక్సిన్‌ తీసుకోవడం ద్వారా ఎలాంటి నొప్పి ఉండదని, సురక్షితమైందని చెప్పారు. టీకా ప్రాణాలను కాపాడడానికి సంబంధించిందని పేర్కొన్నారు. టీకా రెండో డోసు తీసుకునేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చెప్పారు.కమలా భర్త డౌగ్‌ ఎమ్హాఫ్‌ కూడా టీకా తీసుకున్నారు.

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జోబైడ్‌, అంటు వ్యాధుల నిపుణుడు ఆంథోనీ ఫౌసీ, హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ సెక్రెటరీ అలెక్స్ అజార్ సైతం కరోనా వ్యాక్సిన్ తీసుకోగా .. త్వరలోనే వీరందరికీ వ్యాక్సిన్‌ రెండో డోసు ఇవ్వనున్నారు.

- Advertisement -