రాష్ట్రంలో 24 గంటల్లో 474 కరోనా కేసులు..

19
corona

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 474 పాజిటివ్ కేసులు నమోదుకాగా ముగ్గురు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 2,85,939కు చేరాయి.

ప్రస్తుతం రాష్ట్రంలో 5878 యాక్టివ్ కేసులుండగా 2,78,523 మంది కరోనా నుండి కోలుకున్నారు. ఇప్పటి వరకు 1538 మంది కరోనాతో మృతి చెందారు. దేశంలో కరోనా మరణాల రేటు 1.4 శాతంగా ఉంటే రాష్ట్రంలో 0.53 శాతంగా ఉన్నాయని తెలిపారు. ఇప్పటివరకు కరోనా టెస్టుల సంఖ్య 68,39,281కు చేరాయని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.