‘లోకనాయకుడు’ కమల్‌హాసన్ స్వీయ నిర్మాణంలో రూపొందుతున్న ‘విశ్వరూపం 2’ తొలి రూపు విడుదలైంది. ‘నా దేశం, ప్రజలపై ప్రేమతో..’ అంటూ ట్విటర్ ద్వారా కమల్‌హాసన్ ఫస్ట్‌లుక్‌ను అభిమానులతో పంచుకున్నారు. ఎన్నో అవాంతరాల మధ్య విడుదలైన ‘విశ్వరూపం’ తొలిభాగం ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అనంతరం రెండో భాగం ఆర్థిక సమస్యలతో పాటు పలు ఇతర కారణాల్లో చిక్కుకుని విడుదల ఆలస్యమైంది.
ఇటీవలే హిందీతో పాటు తెలుగు, తమిళం డబ్బింగ్ కార్యక్రమాలను మొదలుపెట్టినట్లు కమల్ వెల్లడించారు. ఈ సంవత్సరంలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు. రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్‌హాసన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.
కమల్ హాసన్ స్వయంగా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కమల్ తో పాటు పూజ కుమార్, ఆండ్రియా, శేఖర్ కపూర్ లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే నిర్మాణ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమాకు మిగిలి ఉన్న కొద్ది పాటి పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి ఈ ఏడాది చివరకల్లా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు కమల్.
With love my country and it's people pic.twitter.com/3zdir7u1Gh
— Kamal Haasan (@ikamalhaasan) May 2, 2017