మధ్యప్రదేశ్‌ సీఎంగా కమల్‌నాథ్…

262
kamalnath
- Advertisement -

మధ్యప్రదేశ్‌లో ఉత్కంఠభరితంగా సాగిన పోరులో కాంగ్రెస్‌ పార్టీ మెజార్టీ స్థానాలు దక్కించుకుని ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎవరు సీఎం అవుతారో అన్నది సస్పెన్స్‌గా మారగా ఆ ఉత్కంఠకు బ్రేక్‌ వేసింది కాంగ్రెస్ హైకమాండ్. సీనియారిటీ వైపే మొగ్గుచూపి కమల్‌నాథ్‌ (72)ను సీఎం అభ్యర్థిగా ప్రకటించింది.

ఢిల్లీ నుండి భోపాల్‌కు చేరుకున్న కమల్‌నాథ్‌కు పార్టీ శ్రేణుల నుంచి ఘనస్వాగతం లభించింది.  సీఎం పదవి కోసం ఆయనతో సమానంగా యువనేత జ్యోతిరాదిత్య సింధియా చివరిక్షణం వరకు పోటీ పడ్డారు.

230 స్థానాలున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో 114 స్థానాలు సాధించి మ్యాజిక్ ఫిగర్ కు రెండే రెండు సీట్ల దూరంలో నిలిచింది. 109 స్థానాల్లో గెలిచి బీజేపీ పార్టీ కాంగ్రెస్ గట్టిపోటీ ఇచ్చింది. అయితే ప్రభుత్వ ఏర్పాటు విషయంలో బీఎస్పీ చీఫ్ మాయావతి మద్దుత ఇవ్వడంతో అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టగల్గింది.

మరోవైపు ఛత్తీస్‌గఢ్‌ సీఎం ఎంపిక నేటికి వాయిదా పడింది.లుస్తోంది. చత్తీస్‌గఢ్‌లో పీసీసీ అధ్యక్షుడు భూపేశ్‌ బఘేల్, ఓబీసీ నేత తామ్రధ్వజ్‌ సాహు, సీనియర్‌ నేతలు టీఎస్‌ సింగ్‌ దేవ్, చరణ్‌సింగ్‌ మహంత్‌లు సీఎం రేసులో ఉన్నారు. 15 ఏళ్లుగా అధికారంలో లేకపోయినా.. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసిన బఘేల్‌కే సీఎం పీఠం దక్కనున్నట్లు సమాచారం.

- Advertisement -