రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశారు మక్కల్ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) అధనేత కమల్ హాసన్. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్.. కమల్ చేత ప్రమాణస్వీకారం చేయించిన అనంతరం అభినందించారు.
2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎంఎన్‌ఎం మద్దతు కోసం అధికార డిఎంకె నేతృత్వంలోని కూటమి కమల్ హాసన్‌కు రాజ్యసభ సీటును ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు ఆయనను నామినేట్ చేశారు.
జూన్ 6న కమల్ హాసన్ తమిళనాడు సచివాలయంలో ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ మరియు డిఎంకె మిత్రపక్షాలైన విసీకే నేత తొల్. తిరుమావళవన్, ఎంఎడిఎంకె నాయకుడు వైకో, తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు సెల్వ సమక్షంలో తన నామినేషన్ దాఖలు చేశారు. 234 మంది సభ్యులతో ఉన్న తమిళనాడు అసెంబ్లీలో రాజ్యసభ సీటును గెలవడానికి కనీసం 34 ఓట్ల అవసరం ఉంటుంది.
డిఎంకె నేతృత్వంలోని ఇండియా కూటమికి (డిఎంకె-133, కాంగ్రెస్-17, విసీకే-4, సిపిఐ-2, సిపిఎం-2) మొత్తం 158 ఎమ్మెల్యేల మద్దతుతో నాలుగు సీట్లు గెలుచుకుంది. కమల్ హాసన్‌తో పాటు ఐదుగురు అభ్యర్థులు తమిళనాడు నుంచి ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. కమల్ హాసన్‌తోపాటు డిఎంకె అభ్యర్థులు కవి సల్మా (ఏ రొక్కయ్య మాలిక్), ఎస్‌ఆర్. శివలింగం, పి. విల్సన్ (రెండో టర్మ్), అలాగే ఎఐఏడిఎంకె అభ్యర్థులు ఐఎస్ ఇన్బదురై మరియు ధనపాల్ రాజ్యసభకు ఎన్నికయ్యారు.
Also Read:RCB ఆటగాడిపై పోక్సో కేసు

