ఈనెల 18 నుంచి భారతీయుడు2 షూటింగ్ ప్రారంభం..

285
bharatiudu 2
- Advertisement -

విల‌క్ష‌ణ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ న‌టించిన భార‌తీయుడు సినిమా సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసిన విష‌యం తెలిసిందే. స్టార్ ద‌ర్శ‌కుడు శంక‌ర్ ఈమూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇప్పుడు మ‌ళ్లీ ఆ సినిమాకు సక్వేల్ చేయాడానికి రంగంలోకి దిగాడు ద‌ర్శ‌కుడు శంక‌ర్. ఈచిత్రానికి భారతీయుడు2 అనే టైటిల్ ను ఖారారు చేశారు. తాజాగా ఈమూవీ పూజా కార్య‌క్ర‌మాల‌ను కూడా నిర్వ‌హించారు.

bharatiyudu

ఈచిత్రం షూటింగ్ ఎక్కువ‌గా చైన్నై, పొల్లాచ్చి, యూర‌ప్ ల‌లో తెర‌కెక్కించ‌నున్నారు. ఈసినిమా రెగ్యూల‌ర్ షూటింగ్ ఎప్ప‌టి నుంచి ప్రారంభ‌మ‌వుతుందో అని ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు క‌మ‌ల్ అభిమానులు. తాజాగా ఉన్న స‌మాచారం ప్ర‌కారం ఈ మూవీ రెగ్యూల‌ర్ షూటింగ్ కు ముహుర్తం ఖారారు చేశారు చిత్ర యూనిట్.

ఈ నెల 18 నుంచి పొల్లాచ్చిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాలో కమల్ సరసన కాజల్ కథానాయికగా నటించనుంది. దుల్కర్ సల్మాన్ .. శింబు ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలను చేయనున్నారు. ఈ సినిమాకి అనిరుధ్ సంగీతాన్నిఅందిస్తున్నారు.

- Advertisement -