118..ప్రతి ఒక్కరి కథ..!

269
kalyan ram 118
- Advertisement -

నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా కేవీ గుహన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 118. కల్యాణ్ రామ్ సరసన నివేదా థామస్, శాలిని పాండే హీరోయిన్లుగా నటించగా మార్చి1న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా ఆసక్తికర విషయాలను వెల్లడించారు కల్యాణ్ రామ్‌.

తన కెరీర్‌లో కొత్త దర్శకులతో సినిమాలు చేశానని గుహన్ చెప్పిన కథ బాగా నచ్చిందన్నారు. ఇది ప్రతి ఒక్కరి కథని..సమాజంలో చాలామందికి కొన్ని విచిత్రమైన పరిస్థితులు ఎదురవుతుంటాయి. నాకే ఇలా ఎందుకు జరుగుతుంది అని ఆలోచిస్తుంటారు..కొంతమంది ఆలోచించరు. కానీ ఈ సినిమాలో హీరోకి కుతూహలం ఎక్కువ ఏం జరిగిందో తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంటాడు..దాని వల్ల ఏం జరిగింది..ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటాడు అన్నదే సినిమా కథన్నారు.

తెలుగు తెరపై ఇలాంటి విజువల్స్‌ ఇప్పటివరకు చూసి ఉండరని చెప్పారు కల్యాణ్ రామ్‌. ప్రేక్షకులు సీటు అంచున కూర్చుని సినిమా చూస్తారు. ఎందుకంటే ఈ సినిమాలో ప్రేక్షకుడే హీరో అన్నారు.

రెండు మూడు కథలు సిద్ధంగా ఉన్నాయని కానీ 118 విడుదలయ్యాకే ఏ కథ ఎంచుకోవాలని నిర్ణయించుకుంటానని చెప్పారు. కొత్త తరహా సినిమాల్ని చేయడానికే ఇష్టపడతానని తెలిపారు. యాక్టింగ్ అంత సులభం కాదని నిజ జీవితం వేరు తెరపై చేస్తున్న పాత్రలు సినిమాలోని పాత్రల్లోకి వెళ్లాలంటే సమయం పడుతుందని అందుకే దానికోసం కసరత్తు చేయాలన్నారు.

- Advertisement -