కాళేశ్వరం జలగర్జన..

67
- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయి. సాగు, తాగునీటికి ఇబ్బంది లేకుండా వెంటనే జలాల తరలింపును చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించడంతో ఆ మేరకు అధికారులు చర్యలు చేపట్టారు. రామగుండం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో అధికారులు ఎత్తిపోతలను సోమవారం లాంఛనంగా ప్రారంభించారు.

లింక్‌-1 లక్ష్మీ పంప్‌హౌస్‌లో ఆరు పంపుల ద్వారా 13.200 క్యూసెక్కుల నీటిని అన్నారంలోని సరస్వతి బరాజ్‌లోకి తరలిస్తున్నారు. అక్కడ లింక్‌-2లో నాలుగు పంపులతో 11.720 క్యూసెక్కుల నీటిని పార్వతీ బరాజ్‌లోకి, అక్కడి నుంచి నాలుగు మోటార్ల ద్వారా 10,440 క్యూసెక్కుల నీటిని ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఎత్తిపోస్తున్నారు. ఎల్లంపల్లికి చేరిన జలాలను ఒకవైపు ఎస్సారెస్పీకి, మరోవైపు రాజరాజేశ్వర జలాశయానికి తరలిస్తున్నారు.

Also Read:కాంగ్రెస్‌ను నమ్మితే కల్లోలమే..?

- Advertisement -