చెన్నై దుస్థితి హైదరాబాద్‌కు ఎప్పటికి రాదు:కేటీఆర్‌

257
ktr twitter

చెన్నై మహానగరాన్ని భారీ వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఓ వైపు ముంచెత్తుతున్న వరదలు మరోవైపు నీటి కష్టాలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్‌లో మహానగరాలకు మంచినీటి ముప్పు తప్పదని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ట్విట్టర్ ద్వారా స్పందించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

చెన్నై లాంటి విపత్కర పరిస్ధితి హైదరాబాద్‌కు రావొద్దనే ముందుచూపుతో కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించామని రికార్డు టైంలో పూర్తి చేశామని ట్వీట్ చేశారు కేటీఆర్‌.

ఇంత తక్కువ వర్షాలు పడుతున్న కాలంలో, గోదావరిలో అసలు ఏమాత్రం వరద రాని సీజన్ లో ప్రాణహిత నదిలో వస్తున్న వరదనీటిని ఐదు మోటార్ల ద్వారా లిఫ్ట్ చేసి పది రోజుల్లో 11 టీఎంసీ నీటిని ఒడిసిపట్టి నిల్వ చేశామని పేర్కొన్నారు.

దీనితో కనీసం లక్షన్నర ఎకరాలకు నీరు అందించవచ్చు. ఇది ప్రారంభం మాత్రమే. వర్షాలు కురిసి, వరద పెరిగి అన్ని మోటార్లు మొదలైతే తెలంగాణలో బీళ్లన్ని గోదావరి నీటితో సస్యశ్యామలం. ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రి అవడం వల్ల తెలంగాణకు చేకూరిన లబ్ది ఇది అంటూ తన వరుస ట్వీట్లలో పేర్కొన్నారు.