కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్…అంటే తెలియదు కానీ కే విశ్వనాథ్ అంటే ఈ పేరు తెలియని వారు తెలుగు వారుండరు. ఈయన కలం నుంచి జాలువారిన పారిజాతాలు. ఇవి నిత్యం పరిమళిస్తూ…సువాసన వెదజల్లే సినిమా పుష్పాలు. ముఖ్యంగా కళలకు జీవం పోస్తూ తీసిన సినిమాలు నిత్యం అజరామరం. అందులోనూ ఆయన తెరకెక్కించిన సినిమాల్లో ముఖ్యంగా ఎస్ అక్షరంతో వచ్చే సినిమాలు తెలుగునాటనే కాదు యావత్తు జాతి గర్వించదగ్గ సినిమాలు తీశారు. అవేంటో తెలుసా…
సరదా (1973) ఈ సినిమా ద్వారా తొలి నంది అవార్డు వచ్చింది. 1976లో తీసిన సిరిసిరి మువ్వ సినిమాలో జయప్రద, చంద్రమోహన్ నటించారు. అంతే కాదు ఈ సినిమాను హిందీలో సర్గమ్ తో హిందో అడుగుపెట్టారు. 1978లో వచ్చిన సీతామహాలక్ష్మి సినిమాలో తాళూరి రామేశ్వరి, చంద్రమోహన్ నటించగా… నంది అవార్డ్‌తో పాటుగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు వరించాయి.
1979లో శంకరాభరణం సినిమాకు అవార్డులు రివార్డులు కొకొల్లలు. మాస్కో ఇంటర్‌నేషనల్ అవార్డు, నంది అవార్డు, నేషనల్ ఫీల్మ్ ఫేర్ అవార్డు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వరించాయి. ఈ సినిమాను ఆ రోజుల్లో వందల సార్లు చూసిన మళ్లీ మళ్లీ చూడాలనిపించే విధంగా అద్భుతమైన దృశ్యకావ్యంగా నిలిచిపోయింది. మనసుకు కులం అక్కర్లేదు అని చెప్పిన దృశ్యకావ్యం సప్తపది… 1981లో వచ్చిన ఈ సినిమాకు నేషనల్ ఫిల్మ్ ఫేర్ అవార్డు, నంది అవార్డులు వరించాయి. 1982లో మెగాస్టార్ చిరంజీవి, సుమలత కలిసి నటించిన శుభలేఖ సినిమా వరకట్నం నేపథ్యంలో తెరకెక్కించారు. అన్నట్టు 1983లో ఈ సినిమాను శుభ్‌కామ్నా అని రీమేక్ చేశారు.
1983లో సాగర సంగమం సినిమా ద్వారా కమల్ హాసన్, విశ్వనాథ్ కలయికలో వచ్చిన అద్భుతమైన దృశ్యకావ్యం. 1985లో మరొక సారి కమల్ హసన్, విశ్వనాథ్ కలయికలో వచ్చిన స్వాతి ముత్యం సినిమా. నిజంగానే స్వాతి ముత్యం లాంటి పాత్రలు కలగలిపిన సినిమా. నంది అవార్డు, ఫిల్మ్ ఫేర్ ఆవార్డులు, ఏసియా ఫసిఫిక్ ఫిల్మ్ ఫెస్టివల్ లాంటి ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నది మన స్వాతిముత్యం. 1986లో సిరివెన్నెల సినిమా ద్వారా తెలుగు సినిమా పాటల రంగంలో సినిమా పేరును తన పేరుగా మార్చుకున్న వ్యక్తి సీతారామశాస్త్రి. అంతగా జనం మెచ్చిన పాటలను ఈ సినిమాలో వినిపించాయి. ఒక గుడ్డివాడికి ఒక మూగ వ్యక్తి మధ్య సాగే సినిమాగా నిలిచింది.
1987లో వచ్చిన స్వయం కృషి(చిరంజీవి), శ్రుతి లయలు(రాజశేఖర్) సినిమాల ద్వారా పట్టుదల ప్లస్ సంగీతం కలిగిన వ్యక్తుల కలయికగా ఈ రెండు సినిమాలు తీశారు. వేటికవే సాటి ఈ సినిమాలు. 1988లో వచ్చిన వెంకటేష్, భానుప్రియ కాంబినేషన్‌లో వచ్చిన స్వర్ణకమలం. ఇది నంది అవార్డు మరియు ఫిల్మిం ఫేర్ అవార్డు ఇన్ తెలుగు సినిమా ఎక్స్ప్రేస్ అవార్డు వరించాయి. అన్నట్టు ప్రముఖ ఒడిసి నర్తకి, అమెరికన్ షారోన్ లేవేన్ నటించారు.
1989లో అవినితి పరులైన నాయకులను తనదైన శైలిలో ఆట కట్టించే పాత్రలో మెరిసిన బాన్‌చందర్ నటించిన సినిమా సూత్రదారులు. ఏఎన్నార్, రమ్యకృష్ణ, మురళి మోహన్, సత్యనారయణ, కేఆర్ విజయ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. 1992లో వచ్చిన స్వాతి కిరణం సినిమా సంగీత ప్రపంచంలో తనదైన ముద్రను వేసుకుంది. 1995లో వచ్చిన శుభసంకల్పం…కమల్ హసన్, విశ్వనాథ్ కలయికలో మూడవ సారి వచ్చిన ఈ సినిమా… ఫిల్మ్ ఫేర్ అవార్డును వరించింది.
2004లో వచ్చిన సంగీత నేపథ్యం కలిగిన కుటుంబంలోని వ్యక్తుల మధ్య జరిగే అవినాభావ సంబంధంల కలయికే స్వరాభిషేకం. దీనికి గాను ఫీచర్ ఫిల్మ్ ఇన్ తెలుగు విభాగంలో జాతీయ స్థాయిలో అవార్డు లభించింది. ఇక చివరిగా తీసిన ఎస్ లెటర్‌తో తీసిన సినిమా శుభప్రదమ్. అల్లరి నరేష్, మంజరీ పడ్నీస్ నటించారు. ఇవే కావు దృశ్య కావ్యాలు మరెన్నో ఉన్నా అందులోని కొన్ని మాత్రమే ముఖ్యంగా ఎస్ లెటర్‌తో వచ్చిన సినిమాలు బాగా పాపులర్ అయ్యాయి. జనం మెచ్చిన సినిమాలుగా నిలిచాయి. ఇందులో ప్రతి పలుకు ప్రతి పాట ఓ అక్షర పూదోట. ఇంత గొప్ప సినిమాలు అందించిన కే. విశ్వనాథ్ నిజంగానే కళాతపస్వి…
ఇవి కూడా చదవండి…