జయం, నువ్వునేను వంటి చిత్రాలతో అప్పట్లో అందరి దృష్టిని ఆకర్షించిన డైరెక్టర్ తేజ. చాలా గ్యాప్ తర్వాత బాహుబలి స్టార్ రానాతో నేనే రాజు నేనే మంత్రి అనే ఓ ఫుల్ లెంగ్త్ పొలిటికల్ మూవీని తేజ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కాజల్ హీరోయిన్గా నటిస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇటీవల విడుదలైన టీజర్‌కు అనూహ్య స్పందన రాగా తాజాగా కాజల్ ఫస్ట్ లుక్‌ని ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు.
నేనే రాధ నేనే భార్య అంటూ చక్కనైన చీరకట్టులో ఉన్న కాజల్ చూడముచ్చటగా ఉన్నారు. ఈ చిత్రంలో నటించే ఇతర పాత్రధారుల పోస్టర్లను కూడా ఈరోజు విడుదల చేయనున్నట్లు రానా తన ట్విటర్ ద్వారా తెలిపారు.
ఈ సినిమాలో రానా రాధా జోగేంద్ర అనే మంత్రి పాత్రలో నటిస్తున్నాడు. రానాకి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. డి.సురేశ్‌బాబు, కిరణ్‌రెడ్డి, భరత్ చౌదరిలు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాని తెలుగుతో పాటు తమిళంలోనూ నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.