కాబోయే భర్తతో కాజల్ అగర్వాల్..!

527
kajal
- Advertisement -

హీరోయిన్ కాజల్‌ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. దీంతో కాజల్‌కు స్నేహితులు, బంధువులు, సన్నిహితులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నెల 30న ముంబైలో గౌతమ్ కిచ్లూని వివాహం చేసుకోబోతుంది. తమ దగ్గరి బంధువులతో కలిసి ఈ వివాహ వేడుక నిరాడంబరంగా జరగనుందని కాజల్ అగర్వాల్ తెలిపింది.

ఈ సందర్భంగా ఆమెకు గౌతమ్‌ కిచ్లూ సోదరి గౌరి కిచ్లూ నాయర్‌ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ.. కాజల్, గౌతమ్‌లతో తాను ఇటీవల దిగిన ఫొటోను షేర్‌ చేసింది. ఆమె చేసిన పోస్టును చూసిన కాజల్ కూడా స్పందిస్తూ కృతజ్ఞతలు తెలిపింది. అంతేకాదు, ఈ ఫొటోను కాజల్ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీగా పెట్టుకుంది. ఈ ఫొటోను చూసిన అభిమానులు ఆ ఫొటోను స్క్రీన్ షాట్లు తీసుకుని పెట్టుకున్నారు. కాజల్ గృహిణి కాబోతున్నందుకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

- Advertisement -