తల్లి కాబోతున్న కాజల్..?

34
kajal

టాలీవుడ్‌ అందాల చందమామ కాజల్ అగర్వాల్ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులో లక్ష్మి కళ్యాణం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. కెరీర్ మొదలై 16 ఏళ్లైనా కూడా ఇప్పటికీ అదే జోరు చూపిస్తోంది ఈ అందాల ముద్దుగుమ్మ. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ గ్లామరస్ పాత్రలతో పాటు ప్రాధాన్యమున్న పాత్రలను కూడా ఎంచుకుంటు ముందుకెళ్లోంది. ఈనేపథ్యంలో ఈ చందమామ తల్లి పాత్ర పోషించడానికి రెడీ అవుతోంది.

ఇటీవల కాజల్ తమిళంలో ‘రౌడీ బేబీ’ అనే చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కే ఈ చిత్రంలో ఆమె ఓ అమ్మాయికి తల్లిగా సత్తా వున్న క్యారెక్టర్ చేయనుందని తెలుస్తోంది. తల్లీకూతుళ్ల సెంటిమెంట్ నేపథ్యంలో ఈ చిత్రకథ సాగుతుందట. అలాగే, ఇందులో కాజల్ సాదాసీదాగా డీ-గ్లామరైజ్డ్‌గా కనిపిస్తుందని అంటున్నారు. శరవణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటి రమ్యకృష్ణ కీలక పాత్ర పోషించనుంది. కాగా.. గత సంవత్సరం తన ప్రియుడు గౌతమ్‌ను పెళ్లి చేసుకున్న కాజల్‌ ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాల్లో నటిస్తోంది.