సాయిశ్రీనివాస్‌తో షూటింగ్‌లో కాజల్..!

249
Kajal Aggarwal
- Advertisement -

యువ హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కథానాయకుడిగా పలు సూపర్ హిట్ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేసిన శ్రీనివాస్ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించనున్న ఈ చిత్రాన్ని వంశధార క్రియేషన్స్ పతాకంపై నవీన్ సొంటినేని (నాని) నిర్మించనున్నారు. కాజల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. త్వరలో ఈ చిత్ర టైటిల్ ను అధికారికంగా ప్రకటించబోతున్నారు.

ఈ చిత్ర హిందీ శాటిలైట్ రైట్స్ 9 కోట్ల 50 లక్షలకు అమ్ముడు అయ్యాయి. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందించబడుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు నీల్ నితీష్ ముఖేష్ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన ఒక ప్రత్యేక సెట్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ మధ్య కొన్ని కీలక సీన్స్ చిత్రీకరుస్తున్నారు. భారీ తారాగణంతో తెరకెక్కబోతున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. చోటా కె నాయడు సినిమాటోగ్రఫి అందిస్తున్న ఈ సినిమాకు ప్రముఖ రచయిత అబ్బూరి రవి మాటలు రాస్తున్నారు.

Kajal Aggarwal

హర్షవర్ధన్ రాణే ముఖ్య పాత్రలో కనిపించబోతున్న ఈ సినిమాలో సత్యం రాజేష్, కళ్యాణి నటరాజన్, అపూర్వ ఈ మొవీలో మరో ఇంపార్టెంట్ రోల్స్ లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి చాగంటి శాంతయ్య కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. రంగస్థలం సినిమా తరువాత చంద్రబోస్ ఈ సినిమాకు సింగిల్ కార్డు రచయితగా పని చెయ్యడం విశేషం.

నటీ నటులు: బెల్లంకొండ సాయి శ్రీనివాస్,కాజల్ అగర్వాల్,నీల్ నితీష్ ముఖేష్,అజయ్,పోసాని కృష్ణ మురళి,హర్షవర్ధన్ రాణే,సత్యం రాజేష్,కళ్యాణి నటరాజన్,అపూర్వ… తదితరులు. సాంకేతిక నిపుణులు: డైరెక్టర్: శ్రీనివాస్,నిర్మాత: నవీన్ సొంటినేని,కో ప్రొడ్యూసర్: చాగంటి శాంతయ్య,బ్యానర్: వంశధార క్రియేషన్స్,మ్యూజిక్: థమన్,లిరిక్స్: చంద్రబోస్,కెమెరా మెన్: చోటా కె నాయుడు,డైలాగ్స్: అబ్బూరి రవి,ఎడిటర్: చోటా కె ప్రసాద్, ఆర్ట్ : చిన్నా, పి. ఆర్.ఓ: వంశీ శేఖర్.

- Advertisement -