వ‌రంగ‌ల్‌లో భర్తతో కాజ‌ల్ అగ‌ర్వాల్ సంద‌డి..

365
Kajal Aggarwal

టాలీవుడ్ హీరోయిన్‌ కాజ‌ల్ అగ‌ర్వాల్ వ‌రంగ‌ల్‌లో సంద‌డి చేసింది. శుక్రవారం వ‌రంగ‌ల్ నగరంలో కాసం పుల్ల‌య్య షాపింగ్ మాల్‌ను ఈ అందాల చందమామ ప్రారంభించింది. ఇలాంటి కార్య‌క్ర‌మాల‌కు ఒంటరిగా వెళ్లే కాజ‌ల్..ఈ సారి మాత్రం హైద‌రాబాద్ నుంచి వ‌రంగ‌ల్‌కు భ‌ర్త గౌత‌మ్ కిచ్లూను వెంట తీసుకొచ్చింది. బ్యూటిఫుల్‌ శారీలో అచ్చమైన తెలుగు అమ్మాయిలా అంద‌రిని ఆకట్టుకుంది కాజ‌ల్‌. ఈ బ్యూటీ వస్తుందని తెలిసి ఫ్యాన్స్‌ భారీ సంఖ్యలో వచ్చారు. షాపింగ్ మాల్ స‌మీపంలో త‌న‌ను చూడ‌టానికి వ‌చ్చిన అభిమానులకు భ‌ర్త గౌత‌మ్ కిచ్లూను ప‌రిచ‌యం చేసింది ఈ అమ్మడు.

గౌత‌మ్‌, ఫ్యాన్స్ తో క‌లిసి సెల్ఫీ దిగింది. న‌న్ను క‌లిసేందుకు ఇక్క‌డ‌కు వ‌చ్చిన ప్ర‌తీ ఒక్క‌రికి ధ‌న్య‌వాదాలు. నేను వ‌రంగ‌ల్ వ‌చ్చిన ప్ర‌తీసారి మీ అంద‌రి నుంచి నాకు గొప్ప స్వాగ‌తం ల‌భిస్తుంది. నా సినిమాలు ఆద‌రిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. వ‌రంగ‌ల్ అంటే త‌న‌కెంతో ఇష్ట‌మ‌ని చెప్పింది కాజ‌ల్‌. కాజ‌ల్‌, గౌత‌మ్ కిచ్లూతో క‌లిసి వ‌రంగ‌ల్ లో సంద‌డి చేసిన ఫొటోలు నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. కాజల్ గత ఏడాది అక్టోబరు 30న తన చిన్ననాటి స్నేహితుడు, వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లును వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.