Kajal:గ్యాప్ ఇవ్వబోతున్న కాజల్ అగర్వాల్

28
- Advertisement -

చందమామ కాజల్ అగర్వాల్ ఇప్పటికే పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. కాజల్‌ కొడుక్కి ‘నీల్ కిచ్లు’ అని పేరు కూడా పెట్టారు. అయితే,ఒక్క కాజల్ అగర్వాల్ కే కాదు, ఏ అమ్మాయైనా తల్లి బంధంలోకి అడుగుపెట్టాక ఆ అమ్మాయికి బాధ్యతలు అమాంతం పెరిగిపోతాయి. బాధ్యతలు కన్నా బిడ్డని చూసుకునేందుకు తగినంత సమయం లేక తమని తాము పట్టించుకోవడానికి కూడా టైమే ఉండదు. పిల్లలకి చూసుకోవడం, ఇంటి బాధ్యతలతో ఒక్కోసారి నిద్ర కూడా సరిపోదు. ఇప్పుడు అదే స్థితిలో కాజల్ అగర్వాల్ కూడా ఉందట.

కాజల్ అగర్వాల్ ప్రస్తుతం ఇండియన్ 2 చిత్రంలో కమాల్ హాసన్ సరసన నటిస్తోంది. ఈ సినిమాకి కాజల్ ఎక్కువ రోజులు డేట్స్ కేటాయించాల్సి వస్తోంది. దీంతో కొడుక్కి కాజల్ దూరంగా ఉంటుంది. అందుకే, ఇక నుంచి సినిమాలు ఒప్పుకునే ముందు ఎక్కువ రోజులు డేట్స్ కేటాయించాల్సి వచ్చే చిత్రాలను ఒప్పుకోకూడదు అని కాజల్ నిర్ణయం తీసుకుంది. అవసరం అయితే, కొన్నేళ్లు నటనకు దూరంగా ఉండి, తన బిడ్డను చూసుకోవాలి అని కాజల్ ప్లాన్ చేసుకుంటుంది.

అయితే, తన సమయం మొత్తం తన బిడ్డని చూసుకోవడానికే కేటాయిస్తే.. సినిమా కెరీర్ పోతుంది అనే బాధ కాజల్ లో ఉందట. ఒకవేళ సినిమా కెరీర్ కంటిన్యూ చేస్తే.. ఇక తనని తాను చూసుకోవడానికి కూడా సమయం దొరకదు అని, పైగా ఒక తల్లిగా బిడ్డని చూసుకోవడానికి, ఇల్లు చక్కబెట్టుకోవడానికే టైమ్ సరిపోదు అని, అందుకే, ఇష్టం లేకపోయినా, కాజల్ సినిమాలకు గ్యాప్ ఇవ్వబోతుంది.

Also Read:రష్మిక అందాలకు అడ్డు లేదు

- Advertisement -