వృక్షార్చన..మొక్కలు నాటిన కడియం నర్సరీ రైతులు

6
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, రైతుబంధు కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పిలుపు మేరకు వృక్షార్చన లో భాగంగా రాజహేంద్రవరం లోని కడియం నర్సరీల రైతుల ఆద్వర్యంలో వెయ్యి మొక్కలు నాటి ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ముఖ్య అతిథిగా హాజరై రైతులతో కలిసి మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ రైతు బంధువు, హరిత ప్రేమికుడు అయిన కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా కడియం నర్సరీ రైతు పాలూరి నాని ఆధ్వర్యంలో 1000 మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం చాలా ఆహ్వానించదగ్గ పరిణామం అని రైతు బంధువు అయిన కేసిఆర్ గారి పై రైతులు చూపించిన ప్రేమ చాలా అభినందనీయమని అన్నారు.

ప్రాంతాలుగా విడిపోయిన కూడా ప్రజలుగా కలిసిమెలిసి ఉందామని ఉద్యమ సమయం నుండి కేసీఆర్ గారు చెప్పేవారని ఇప్పుడు అదే విధంగా ఇక్కడి వాతావరణం చూస్తుంటే గుర్తుకు వస్తుందని అన్నారు.కెసిఆర్ గారు 10 సంవత్సరాల తమ ప్రభుత్వం లో హరితహారం కార్యక్రమం ద్వారా పచ్చదనం పెంచడం కోసం 280 కోట్ల మొక్కలను నాటడం జరిగిందని. దానివల్ల తెలంగాణ వ్యాప్తంగా 8.3% పచ్చదనం పెరిగిందని అన్నారు.

రైతులతో మాట్లాడినప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో హరితహారం కార్యక్రమంలో మా అందరికీ ఎంతో ఉపాధి లభించిందని మా నర్సరీల నుండి తెలంగాణ ప్రభుత్వం మొక్కలను కొనుగోలు చేయడం వల్ల మా వ్యాపారం ఎంతో అభివృద్ధి చెందిందని వారు కేసిఆర్ గారు రైతు బంధువు అని వారు అన్నారు. రైతులు ఎంతో ప్రేమతో మొక్కలు నాటి కేసీఆర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసినారు అని. రైతులందరికీ కేసీఆర్ గారి పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని సంతోష్ గారు అన్నారు.

Also Read:Kerala:అగస్త్య మహర్షి ఆలయంలో పవన్

మాధవ్ కడియం రైతు మాట్లాడుతూ, ” రైతుబంధు మాన్య కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పుట్టినరోజును పురస్కరించుకుని మా కడియం రైతులం అందరం కలిసి మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. గతంలో ఆయన నేతృత్వంలో వ్యవసాయ రంగానికి ఎంతో మేలు జరిగింది. పచ్చదనాన్ని ప్రోత్సహించేందుకు తెలంగాణ రాష్ట్రం లో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించిడం జరిగింది అని. కరోనా విపత్కర సమయంలో మాకు ఆర్డర్లు ఇచ్చి రైతులను ఆదుకున్నారని అన్నారు .

రైతు బంధువు కేసీఆర్ గారు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ఉండాలని, తిరిగి మళ్లీ తెలంగాణ రాష్ట్రంకి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాము” అని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు బాలాజీ, ఈల సత్యనారాయణ, శ్రీనివాసరావు, నిమ్మలపూడి త్రిమూర్తులు, హరిత సేవ నాయకులు రాఘవ, కిశోర్ గౌడ్, పూర్ణ చందర్, పాండాల జగన్మోహన్, మురళీకృష్ణ, సతీష్, ఎన్.ఎన్. రాజు, భోజనారాయణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -