- Advertisement -
తెలుగు చిత్ర పరిశ్రమ మరో గొప్ప నిర్మాతని కోల్పోయింది. ప్రముఖ నిర్మాత కె రాఘవ గత రాత్రి గుండె పోటుతో మృతి చెందారు. 70, 80 దశకాలలో రాఘవ మంచి కుటుంబ కథా చిత్రాలని నిర్మించారు. ఆయన మృతితో టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. తాజాగా కె రాఘవ మృతి పట్ల సిని నటడు,నిర్మాత డాక్టర్ మెహన్‌బాబు స్పందిచారు.
ప్రఖ్యాత నిర్మాత కె.రాఘవ హఠాన్మరణ వార్త విని చాలా బాధపడ్డాను. ఆయన నిర్మాణంలో “తూర్పు పడమర” అనే చిత్రంలో నటించిన నాకు, రాఘవతో విశేషమైన అనుబంధం ఉంది. నిర్మాత అనే పదానికి నిర్వచనంలా వ్యవహరించే ఆయన నేడు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రఘాడ సానుభూతి తెలియజేస్తూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ శిరిడి సాయినాధుని మనస్ఫూర్తిగా వేడుకొంటున్నాను.
- Advertisement -