సుప్రీం 48వ సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ..

134
ramana
- Advertisement -

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు జస్టిస్‌ ఎన్‌.వి.రమణ. ప్రధాన న్యాయమూర్తిగా నిన్నటితో ముగిసిన జస్టిస్‌ బోబ్డే పదవీకాలం ముగియడంతో నేడు ఉదయం 11 గంటలకు 48వ సీజేఐగా జస్టిస్‌ ఎన్‌.వి.రమణతో ప్రమాణస్వీకారం చేయించనున్నారు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో కొద్దిమంది అతిథుల సమక్షంలో జరగనున్న కార్యక్రమం.ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కేబినెట్‌ మంత్రులు, న్యాయమంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు, జస్టిస్‌ ఎన్‌.వి.రమణ కుటుంబసభ్యులు మాత్రమే హాజరయ్యే అవకాశం ఉంది.

కృష్ణా జిల్లా పొన్న‌వ‌రంలో ఓ వ్య‌వ‌సాయ కుటుంబంలో జ‌న్మించారు రమణ.ఆయన ప‌ద‌వీ కాలం 2022, ఆగ‌స్ట్ 26తో ముగుస్తుంది. 2000, జూన్ 27 నుంచి 2013, సెప్టెంబ‌ర్ 1 వ‌ర‌కు ఎన్వీ ర‌మ‌ణ ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టులో జ‌డ్జిగా ప‌ని చేశారు.

- Advertisement -