వరంగల్….టీఆర్ఎస్‌లో చేరిన బీజేపీ నేతలు

136
dayakarrao
- Advertisement -

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల వేళ బీజేపీకి గట్టి షాక్ తగిలింది. బిజెపి సీనియర్ నాయకులు బింగి శ్రీనివాస్, శివ, రాజు తదితరులు మంత్రి ఎర్రబెల్లి సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరగా వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఎర్రబెల్లి…బిజెపి చేస్తున్న మోస పూరిత రాజకీయాలను ప్రజలు లోకి తీసుకెళ్లి ప్రజల్లో చైతన్యాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రతి పార్టీ కార్యకర్త పై ఉందన్నారు. పార్టీ టిక్కెట్లు ఆశించి భంగపడిన ఉద్యమకారులకు, పార్టీ ముఖ్య నాయకులకు కేసీఆర్ తగిన స్థానం కల్పిస్తానని తనవంతుగా హామీ ఇవ్వమని చెప్పారు….కనీసం కరోనా పేషెంట్ల పట్ల జాలి చూపని కేంద్ర ప్రభుత్వం వాక్సిన్ విక్రయాలను పక్క రాష్ట్రాల్లో 150 రూపాయలకు ఇస్తూ తెలంగాణలో 400 రూపాయలు అధిక ధరలను విక్రయిస్తుందన్నారు.

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అన్ని కులాలకు సముచిత స్థానం కల్పిస్తూ టికెట్లు ఇవ్వడం జరిగిందని…కరోనా విజృంభిస్తున్న వేళ కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి వివరిస్తూ పార్టీ గెలుపు కై ప్రతి కార్యకర్త పాటుపడే వలసిందిగా కోరుతున్నానని చెప్పారు.

ఈ సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నేతృత్వంలోని GWMC ఎన్నికల సమన్వయ కమిటీ సభ్యులు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, చొప్పదండి ఎమ్మెల్యే సుంకర రవి శంకర్, TSIIC చైర్మన్ గ్యాదరి బాలమల్లు, గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, వరంగల్ మాజీ మేయర్ గుండా ప్రకాష్ రావు, రైతు రుణవిమోచన కార్పొరేషన్ చైర్మన్ నాగుర్ల వెంకన్న, దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ రెడ్డి, రాష్ట్ర నాయకులు జన్ను జకార్యా పార్టీ నేతలు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -