ప్రణయ్‌కి న్యాయం జరగాలి:రాంచరణ్‌

269
- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ పరువు హత్య కేసును పోలీసులు చేధించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏడుగురిపై కేసు నమోదుచేసిన పోలీసులు నిందితులను మీడియా ముందు హాజరుపర్చారు. నిందితులకు కఠినశిక్ష పడాల్సిందేనని అన్నివర్గాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

పలువురు సినీ ప్రముఖులు సైతం ప్రణయ్ హత్యపై స్పందించారు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ మిర్యాలగూడ పరువు హత్యపై ఆవేదన వ్యక్తం చేశౄరు. ప్రాణం తీస్తే పరువెక్కడుందని ప్రశ్నించిన చరణ్‌…ప్రణయ్‌కి న్యాయం జరగాలని ఆకాంక్షించారు. అసలు సమాజం ఎక్కడికి వెళ్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రణయ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించిన చెర్రీ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానూభూతి తెలిపారు.

ప్రేమకు హద్దులు లేవు , ప్రణయ్‌కు న్యాయం జరగాలి అంటూ ఫేస్‌ బుక్‌లో పోస్ట్ చేశారు. బాధాకరమైన స్థితి. అసలు మనం ఎక్కడికి వెళ్తున్నామంటూ ప్రశ్నిస్తూ రాంచరణ్‌ చేసిన పోస్టును స్క్రీన్ షాట్ తీసి ట్వీట్ చేసింది ఉపాసన.

 ram charan

- Advertisement -