తిరుమల తిరుపతి దేవస్ధానం బోర్డు సభ్యుడిగా మైహోమ్ గ్రూప్ సంస్థల అధినేత జూపల్లి రామేశ్వరరావు పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. త్వరలో రామేశ్వరరావుతో పాటు మిగితా సభ్యుల పేర్లను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్తో పాటు చినజీయర్ స్వామికి సన్నిహితుడైన రామేశ్వరరావు వ్యాపారవేత్తగానే కాదు ఆధ్యాత్మికవేత్తగాను పేరు తెచ్చుకున్నారు.
గత పాలకమండలిని రద్దుచేసి కొత్తగా వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ ఛైర్మన్గా నియమించారు సీఎం జగన్. ఇక టీటీడీ బోర్డులో తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్టకు చెందిన వారికి అవకాశాలు కల్పిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ కోటాలో రామేశ్వరరావు పేరు ఫైనల్ అయినట్లు సమాచారం.
సీఎం కేసీఆర్ స్వయంగా రామేశ్వరరావు పేరును టీటీడీ బోర్డు మెంబర్గా ప్రతిపాదించడంతో ఏపీ సీఎం అంగీకరించారని సన్నిహితవర్గాల సమాచారం. ఇక సినీ రంగం నుంచి దిల్ రాజుతో పాటు జగన్ చిన్ననాటి స్నేహితుడు అక్కినేని హీరో సుమంత్ పేర్లు పరిశీలనలో ఉన్నాయని సమాచారం.