కోమటిరెడ్డితో జూపల్లి భేటీ..

43
- Advertisement -

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో భేటీ అయ్యారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు. త్వరలో జూపల్లి కాంగ్రెస్‌లో చేరనుండగా వీరిద్దరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.

తాను టీ తాగడానికి మాత్రమే కోమటిరెడ్డి ఇంటికి వచ్చానని జూపల్లి పేర్కొన్నారు. ఏ పార్టీలో చేరుతానో ఇంకా డిసైడ్‌ చేసుకోలేదని.. త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు.

Also Read:ఆడవారు గాజులు ఎందుకు ధరిస్తారో తెలుసా..!

జూపల్లి పాత మిత్రుడని కోమటిరెడ్డి తెలిపారు. కాంగ్రెస్‌లోకి వస్తే బాగుంటుందని చెప్పానని అన్నారు. నల్గొండలో 18 లేదా 19వ తేదీల్లో ప్రియాంక గాంధీ సభ ఉంటుందని వెల్లడించారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ దూకుడు ఏంటో చూస్తారన్నారు. ఇక.. షర్మిల పార్టీలోకి వస్తే మంచిదేనని పేర్కొన్నారు.చేరికల విషయంలో అధిష్టానందే ఫైనల్‌ అని శ్రీధర్‌బాబు అన్నారు.

- Advertisement -