హిందీలో సల్మాన్ వ్యాఖ్యాతగా రూపొందిన బిగ్ బిస్ షో ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. త్వరలోనే ఈ ప్రోగ్రాం తెలుగులోనూ టెలికాస్ట్ కానుంది. మీలో ఎవరు కోటీశ్వరుడు గేమ్ షోతో నాగార్జున బుల్లితెర ప్రపంచంలోకి అడుగిడిన తర్వాత బిగ్ స్టార్స్ చాలామంది టీవీ ఇండస్ట్రీవైపు చూస్తున్నారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి సైతం మీలో ఎవరు కోటీశ్వరుడు షోతోనే సిల్వర్ స్క్రీన్ నుంచి స్మాల్ స్క్రీన్‌పైకి వచ్చారు. అలాగే రానా కూడా బుల్లి తెరపై సందడి చేయబోతున్నాడు. కాని ఇప్పుడు అందరి దృష్టి బిగ్ బాస్ షో పై పడింది. షోలో ఉండే విశేషాలు చూడటానికికన్నా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎలా హోస్ట్ చేస్తాడా అని చాలామంది ఎదురుచూస్తున్నారు.
అయితే ఈ షో జూలై 16 నాడు ప్రసారం అవ్వబోతుంది.మరి ఈ బిగ్ బాస్ కోసం యంగ్‌టైగర్ భారీగా పారితోషకం తీసుకుంటున్నాడనే టాక్. అయితే యన్‌టీఆర్ ఆల్రెడీ దీనిపై సమాధానం చెప్పాడు. అయితే ఈ షో కోసం మనోడు ఎంత పుచ్చుకుంటుంది ఫైనల్ గా బయటకొచ్చింది. “నాకు స్టార్ మా వాళ్ళు నా భార్య పిల్లాడు ఇబ్బంది పడకుండా చూసుకోవడానికి సరిపడేంత సొమ్ము ఇచ్చారు.. అందుకు చాలా థాంక్స్. కాని బయట వినిపిస్తున్న అంత మొత్తం నేను తీసుకోవటంలేదు” అని చెప్పాడు ఎన్టీఆర్. రూమర్ల ప్రకారం మనోడు ఒక్కో సీజన్ కు సుమారుగా 8 కోట్లు చార్జ్ చేసినట్లు టాక్. కాకపోతే సీజన్ బట్టి కాకుండా.. ఎపిసోడ్ కు 50 లక్షలు చొప్పున తీసుకుంటున్నాడట ఎన్టీఆర్.
అంటే మొత్తం అన్ని ఎపిసోడ్ లకు కలిపి 6 కోట్లు అన్నమాట. ఆ లెక్కన చూస్తే.. 70 రోజుల సమయంలో తన అతి తక్కువ కాల్ షీట్లకు అతి ఎక్కువ పేమెంట్ ఇదే అనుకోవాలి. ప్రస్తుతం ఒక సినిమాకోసం అయితే ఎన్టీఆర్ 10 నుండి 15 కోట్ల మధ్యలో తీసుకుంటున్నాడనేది టాక్. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో జై లవకుశ అనే సినిమా చేస్తున్న ఎన్టీఆర్ త్వరలో త్రివిక్రమ్ , కొరటాలతో పలు సినిమాలు చేయనున్నాడు.