తారక్‌పై మిలియన్ల అభిమానం..

403
ntr twitter
- Advertisement -

మాస్ హీరోగా ప్రేక్షకుల హృదయాల్లో చెరిగిపోని ముద్రవేసుకున్న హీరో ఎన్టీఆర్‌. టాలీవుడ్‌లో తారక్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. తన సినిమాలతోనే కాదు ఫ్యాన్స్‌కు అండగా ఉండటంలోనూ తారక్ స్టైలే వేరు. అందుకే ఎన్టీఆర్‌ను ఫ్యాన్స్‌కు మరింత చేరువ చేశాయి.

ఏ విషయాన్నైనా ఫ్యాన్స్‌తో పంచుకునే ఎన్టీఆర్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటారు. అందుకే ట్విట్టర్‌లో తారక్‌ణి ఫాలో అయ్యేవారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. తాజాగా ఆ సంఖ్య మూడు మిలియన్ల మార్కును చేరుకుంది.

వరుస హిట్ సినిమాలతో జోష్ మీదున్న తారక్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్‌ చరణ్‌తో మల్టీస్టారర్‌ సినిమా ఆర్ఆరా్ఆర్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన అప్‌ డేట్స్‌ని ఎప్పటికప్పుడూ ట్విట్టర్‌ ద్వారా వెల్లడిస్తున్న తారక్‌ ఫాలో అయ్యేవారి సంఖ్య రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది.

- Advertisement -