తెలుగు సినిమాలో సింగిల్ టెక్ డైలాగ్ ఫర్ఫేక్టనిస్ట్ అంటే ఎవరు అని చెప్తారు. ఠక్కున సీనియర్ ఎన్టీఆర్. ఆ తర్వాత మరేవరు అంటే ఎవరు? సమాధానం కాస్తా కష్టంగా ఉంటుంది. కానీ చిరంజీవి బాలకృష్ణ అంటారు. కానీ ప్రస్తుత తరం నాయకుల్లో ఎవరంటే ఠక్కున జూ.ఎన్టీఆర్ అని చెప్తారు. సింగిల్ టెక్ డైలాగ్ డెలివరీ హీరోగా సినీయర్ తర్వాత జూనియర్ అని టాలీవుడ్ టాక్.
ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన జూ.ఎన్టీఆర్…ఒక చిన్న యాడ్‌లో మాత్రము సింగిల్ వర్డ్ డైలాగ్ చెప్పడానికి డజన్ల కొద్ది టెక్ లు తీసుకున్నారని దానికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట్లో తెగ వైరలవుతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చ టాలీవుడ్‌లో కొనసాగుతుంది.
తాజాగా ఈ యాడ్ కు సంబంధించిన షూటింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ యాడ్ లో తారక్ సూపర్ స్టైలిష్ గా కనిపిస్తున్నారు. ఇక ఈ యాడ్ లో ఒక కోర్ట్ సీన్ ను తెరకెక్కించారు. అయితే ఈ యాడ్ లో ఒక చిన్న డైలాగ్ చెప్పాల్సి ఉంటుంది.. కానీ తారక్ చాలా టెక్స్ తీసుకుంటారు. దాంతో ఎదురుగా ఉన్న రాహుల్ రామకృష్ణ ఆరు పేజీల డైలాగ్ ను సింగిల్ టెక్ లో చెప్తారు. ఈ చిన్న డైలాగ్ చెప్పలేక పోతున్నారేంటి అని ప్రశ్నిస్తాడు..దానికి తారక్.. చేప చిన్నదే అయినా ఎర పెద్దది వెయ్యాలి అని డైలాగ్ చెప్తాడు.
ఆతర్వాత డైలాగ్ చిన్నదే అయినా.. డైలెక్ట్ పర్ఫెక్ట్‌గుండాలి… అంటూ తారక్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. ఇక ఈ యాడ్ మీకింగ్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. కేజీఎఫ్ ఫేమస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడాని టాలీవుడ్‌లో టాక్. ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.
ఇవి కూడా చదవండి…
వాల్తేర్ వీరయ్య… ఫస్ట్ సింగిల్ బాస్ పార్టీ
కస్టడీ…ఫస్ట్ లుక్ విడుదల
కేజీఎఫ్-2కు రికార్డు దగ్గరలో…