కేజీఎఫ్‌-2కు రికార్డు దగ్గరలో…

96
- Advertisement -

ఎలాంటి అంచనాలేకుండా చిన్న సినిమాగా మొదలైన అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న సినిమా కాంతార. తాజాగా మరోమైలురాయిని కూడా దాటింది. హోంబలే ఫిల్మ్స్‌ వారు రూ.16 కోట్లతో నిర్మించిన సినిమా సెప్టెంబర్‌ 30న కన్నడనాట విడుదల కాగా అక్టోబర్‌15న దేశవ్యాప్తంగా పలు భాషల్లో విడుదలై అఖండ విజయం సాధించింది. సినిమా రిలీజై నెలరోజులు దాటినా ఇంకా కలెక్షన్‌లు స్థిరంగా కొనసాగుతూ రూ.400 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టింది.

కన్నడలో ఈ సినిమా ఇప్పటివరకు రూ.168.50 కోట్లు కలెక్ట్‌ చేసింది. మరో మూడు కోట్లు సాధిస్తే కేజీఎఫ్‌-2(రూ.171.50) రికార్డు బ్రేక్‌ అవుతుంది. ఇక తమిళంలో రూ.12.70 కొట్లు, కేరళలో రూ.19.20 కోట్లు, ఓవర్సీస్‌ రూ.44.50 కోట్లు, నార్త్‌ ఇండియాలో రూ.96 కోట్లను సాధించింది. ఆంధ్రా మరియు తెలంగాణలో కలిపి రూ.60 కోట్ల వసూళ్లను సాధించింది.

రిషబ్‌శెట్టి నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్రంలో రిషబ్‌కు జోడీగా సప్తమీగౌడ నటించింది. ఇక ఈ సినిమా నవంబర్‌ 24నుండి అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.

ఇవి కూడా చదవండి…

కథలు దొంగలిస్తాను…విజయేంద్రప్రసాద్ షాకింగ్!

ఆ హీరో కోసం త్రిష సంచలన నిర్ణయం!

పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్:బాస్ సాంగ్

- Advertisement -